పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శివుని సన్నిధికే ' అనే పాట శ్రావ్యమైన గొంతుగల ప్రతి స్త్రీ పాడుతుంది. పల్లెటూళ్లల్లో. ఈపురాణ గాధల్లో తొలికధాగీతం రామకధ. వాల్మీకితాను రచించి లవకుశులచేత గానంచేయిచినట్లు తెలుస్తోంది.

              గే య   జా న ప ద గా ధ లు
         ఇవిగాక బొబ్బిలికధ, దేశింగురాజు కధ, కాటమరాజు కధ, కాంభోజరాజు కధ, ముగ్గు మరాఠీల కధ, పల్నాటివీర కధ, యల్లమ్మ కధ, మల్లమ్మకధ, రావులమ్మ కధ, లక్షమమ్మ కధ, బాలనాగమ్మ కధ, గులేబకావళికధ, కన్యక, బాలరాజు, ధర్మాంగద, సారంగధర మొదలైనవి జంగాలు, మాలదాసులు, పిచ్చుగగుంటలు, పంబలవాళ్లు, ఒగ్గులు, గొల్లలు పేటలో పాడుతూ భిక్షాటన చేస్తుంటారు.  మాలదాసరులు 'విప్రనారాయణ ' బాగా పాడతారు.  జంగాలు తంబుర, డక్కీలలో 'సిరియాళ కధ ' చక్కగా చెబుతారు.  ఒగ్గులు ఢమరికం వాయిస్తూ 'మల్లన్న కధ ' వీరోచితంగా చెబుతారు.  ఈ వీరగాధలు వినేవ్చారికి సంతోషాన్నీ, ఉద్రేకాన్నీ కలిగించి కార్యోన్ముఖుల్ని చేస్తాయి.  ఈ గేయ గాధలు కధా ప్రధానములు-సాహిత్యం అనుషంగెకమే.  గానం వెంబడించి ఉంటుంది.  వీనిలో వీరగాధలు, అధ్భుత గాధలు, చారిత్రకగాధలు ఎక్కువ.  ఒక రాజు గూర్చియో, పేరంటాల్ గూర్చియో, అధ్భుతకార్యములగూర్చియో, సంపూర్ణకధనము ఉండును.  రాజుకధకు కాంబోజ రాజుకధ, వీరగాధకు బాలనాగమ్మకధ, అద్భుతగాధలకు శిరియాళకధ. ధర్మాంగద నిదర్శనాలు.

             గ్రీకుభాషలో 'హోమరు ' వ్రాసిన 'ఒడిఇస్పే 'ఇలియడ్ '
              కధలు యిలాంటి వీరగాధలే.

వీర గాధల్లో నాయకుడు ఒకకార్యాన్నిసాధించడానికి కంకణం కట్టుకుంటాడు. ఎన్ని ఒడిదుడుకులువచ్చినా అన్నిటినీ అధిగమించి చివరకు విజయం పొందుతాడు. (కాంభొజరాజుకధ) నాయకుడు తన మాట నిలుపుకొనుటకై పరీక్షలన్నిటిలోనూ నెగ్గి చివరకు ప్రశంశాపాత్రుడౌతారు (మాంధాత). ప్రతినాయకుని స్పర్ధ, పగ తీర్చుకొనుటకై పలు కష్తాలకోర్చి చివరకు విజయం పొందుతాడు (పల్నాటివీర చరిత్ర).