పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తప్పు త్రోవల పోవువారల
చప్పరించీ మ్రింగుశక్తులు
చెప్పలేదంటనక పొయ్యేరు -
అగలువిడిచి పొగలు దాటేరు
అదిగాక పట్టాపగలు చుక్కలు
చూసి భ్రమసేరు
బుగలు భుగలను మంటమింటను
పుట్టి ఏగిన పిమ్మటాను
దిగులు పడుచూ ప్రజలు చాలా
దిక్కులేని పక్షులవుదరు
చెప్పలేదంటనక పోయారూ -
ఆకసమ్ము ఎర్రనౌను
ఆరు మతములు ఒక్కటౌను
లోకమందలి జనులు అందరు
నీరు నిప్పున మునిగిపోదురు"-
అనే తత్వం భవిష్యద్ధర్శనం చేయిస్తాయి.

                   వీ ర  గే యా లు

ఆది మానవుడు మొదటమునిగింది వీరంలోనే. ఆహారంకోసం జంతువులను వేటాడ్డంలొనూ వీరావేశంపొందవలసి వచ్చింది. ఆ ఆవేశమే వీరరసం.

  • "వీర రసము దానేవీరం, ధర్మవీరం, యుద్ధవీరం, దయావీరం అని నాలుగు విధములు"

దాన వీరమునకు దధీచిని, ధర్మవీరమునకు శ్రీరాముని, యుద్ధవీరమునకు ఖడ్గతిక్కనను, దయావీరమునకు బుద్దుని చెప్పుకొనవచ్చును. జానపదులకు సాహసమే వీరము. సాహసవంతులైన శూరులే వీరులు. సమాజంలో అటువంటి విక్రమసంపన్నులైన అసమాన్యులను వీరులుగా


  • కావ్యాలంకార సంగ్రహము. పుట 430