పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

‘సోగ్గాడే బలే చిన్ని నాయుడే
సగం కాలమన్న తీరలేదు సోగ్గాడికి
కాని పంచి కట్టుకొని కాకినాడ వెళుతుంటే
కాకి పిల్ల తన్నింది సోగ్గాడిని
అహ, సోగ్గాడే బలే చిన్న నాయుడే
సగం కాలమన్న తీరికలేదు సోగ్గాడికి ‘-
గోదావరి పుష్కరాల కెళ్ళిన ఒక పిల్ల తన వింత అనుభవాలను
నెత్తల్లికే యిలా చెబుతోంది -
“గోదావరి పుష్కరాల వింతలు
గోదావరిపుష్కరాలు చూదామని పోతుంటే
కొత్తనీటికుదుపులకు కోకచెంగుబురదలకు
కొప్పులోన కొత్త సవరం
కొట్టుకుపోయిందోలమ్మ”-

ఇది పెదవులు కదలకుండా మనసును నవ్విస్తుంది మరోపాట-

“అప్పన్న కొండకి
ఎప్పుడెల్లిన గాని
చెప్పుకుంటే
చెడ్డ సిగ్గోలప్పమ్మ ‘ అనేది-

ఇక తెలుగువారి హాస్య నాయకీ నాకులైన చిట్టమ్మ - కొయ్యూరు
సంవాద రూపకమైన పాటలో హాస్యం గుబాళిస్తుంది కొంచం మోటుగా-

“చీటికి మాటికి చిట్టమ్మంటే
చీపురుదెబ్బలు తింటవురో రయ్యా కొయ్యోడ-
చిన్నోళ్ళంటరు పెద్దోళ్ళంటరు
కాపులుంటరు, కరణాలుంటరు
నను చిట్టమ్మాఅని పిలవకురో రయ్యో కొయ్యోడ
నేకుందుం నాయుడు కూతుర్నిరోరయ్యా కొయ్యోడ
‘అక్కా అబ్బా అలాగైతే
కొయ్యోడంటూ కూశావంటే