పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్ను కన్నూ కలిసిందోయి
నిన్నూ నన్నూ కలిపిందోయి
ఈడమ్న్నా నే నేడనున్నా నీ
నీడనే నోయీ -
సందు లేదు మనకు
సంద మామ తోడు
ఓ వాలుకన్నులామువ్వ లెంకటస్వామి
నిన్ను నేనూ మరువలేనురా" అనె పాట-
"రంగ మెళ్ళొస్తానే నారాయణమ్మా
నీకు రంగు చీర తెస్తానే నారాయణమ్మ" అనే పాట
జాన పదులలో ప్రాచుర్యం పొందిన శృంగార గేయాలు.
వీని చాయల్లో అధునికులు వ్రాసిన

"గుత్తి వంకాయ కూరోయ్ బావా"
'అప్పన్నా తన్నామన్నా '
'మొక్క జొన్న తోటలో ' వంటి ఎన్నో పాటలు నేదు పల్లె
జనులలోనే కాకుండా నాగరికుల నాలుకలమీద కూడా నాట్య
మాడుతున్నాయి.

                           హాస్యం పాటలు

హాస్యం శృంగార రసాన్నుంచి ఉద్బవించిన మరో రసం అన్నారు పెద్దలు. లాక్షణికులప్రకారం వికృత రూపం, వికార వేషం, వింత చేష్ట, విచిత్ర సంభాషణాదుల వలన కలిగేహాసమే హాస్యం, హాస్యం ఇట్టే ఆకర్షిస్తుంది. మానవహృదయానికి సంతోషాన్నీ, ఉల్లాసాన్నీ కలిగిస్తుంది.. నవ్విస్తుంది, కవ్విస్తుంది, మనిషి ఆరోగ్యానికి నవ్వు మంచి టానిక్, నిజానికి నవ్వు మానవుడికి ఒక వరం. సృష్టిలో నవ్వగలిగేది మానవుడు మాత్రమే. జానపదులపాటలలో హాస్యానికున్న స్థానం అసమానం. ఎవ్వరైనా అమాయకుడిలా కనిపించేయుకుడు మంచి బట్టలు వేసుకొని షోగ్గాతయారైవెళుతుంటే కొంటెపిల్లలు హాస్యంగా ఇలా పాడుతూ వెంటపడతారు. -