పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టమ్మీ
నువు కొరడా దెబ్బలు తింటావే లమ్మీ చిట్టమ్మీ,
మళ్ళీగాని మాటలాడితే
మడమ తాపులు తెంటావే లమ్మీ చిట్టమ్మీ
నే ముద్దప్పయ్యా మనవడినే లమ్మీ చిట్టమ్మీ"-

ఇటువంటి భార్యాభర్తలు పోట్లాడుకొని తడికిని అడ్డం పెట్టుకొని మాట్లాడుకునే 'తడికో తడికో ' అనేపాట. 'ఒకరికీ చేతులు ఇచ్చి, ఒకరికీ కాళ్లు ఇచ్చి నెనొస్తినోయ్ మావ ' వంటి పాటలలో చమత్కారం జానపదుల హృదయాల్ని గిలిగింతలు పెట్టి చక్కని హాస్యాన్నందిస్తాయి.

  • "మనిలోని నరాల బిగింపును సడలించి ఒక విధమైన

    హాయిని కలిగిస్తుంది హాస్యం".

                                త త్వా లు

                  తత్ అనగా అది. అది అనేది పరమాత్మ
                  త్వం అనగా నీవు-నీవు అనేది జీవాత్మ,
                  ఈ జీవాత్ర్మ పరమాత్మల విచారణే తత్వం అని చెప్పు
                                                                  కోవచ్చు

భగవద్గీతలో "పార్ధాయ ప్రతి బోధితాం.... నారాయణేన స్వయం" అనే పదాల అంత్రరార్ధాన్ని మధిస్తే గీతకూడా తత్వమేఅనిపిస్తుంది. "పార్ధ" అంటే పృధివికుమరుడు-పృధివి అంటే భూమి-భూమి అంటే మట్టి-మట్టిఅంటే దేహం. 'నారాయణా ' అంటే నీరమునందు నివసించునది. ఇక్కడ నీరము అనగా శరీరంలో ప్రవహించు నీరు రక్తం. ఈ నీరమందు నివసించునది జీవుడు. జీవుడనగా ఆత్మ. ఇలా అన్వయించి ఆలోచించినప్పుడు ఆత్మ - దేహముల చింతనయే 'గీత ' అని బోధపడుతుంది.

ఈ దేశంలో బైరాగులు, సన్యాసులు, తత్వ బోధకులు, కాషాయ వస్త్రాలుకట్టి, జోలి చంకనబెట్టి, ఆనబకాయబుర్ర తంబుర మీటుతూ వీధుల


  • సంజీవ దేవ్
  చలం సాహిత్యవలోకం   పు.16