పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంట తిరుగుతూ -

'తియ్యానీ మామిడీ పండూ"
తినబోతే దొరుకాదూ తీవులా మెండూ
పండుకు వృక్షాము వరులెవ్వరెరుగారూ
నరులకూ యీ పండూ వశముగాకుండూ" అనీ-.

"చూడచక్కని చిన్నది
ఆమేడ గదిలొనున్నది
ఈడా పింగళులమధ్య
ఆడు కొంటూ ఉన్నది" అని-,
"చందమామా చందమామా చందమామా దీని
సందు తెలిపే జ్ఞానులెవరే చందమామా
కాయమానే పుట్టాలోనా చందమామా....
పాములైదూ మొలగూచుండె చందమామా
తొమ్మిదీ వకిళ్ళూ మూసి చందమామా....
పామును నెమ్మదిగా పట్టావలెరా చందమామా" అని-,
"ఈ జన్మమిక దుర్లాభమురా
సాజన్మాసాకారాసద్గురుఇ గనరా
ఈ జనమిక దుర్లాభమురా
పంచాక్ష రీమంత్రం పఠనా చెయ్యన్నా
పఠనాచేసితె యముడు పారిపోనన్నా
పారీపోతే అంబ ఫల మిచ్చు రన్నా
ఫలమునందినవాడు పరమగురుడన్న
ఈ జమామిక దుర్లాభమురా --
మూడారు వాకిళ్ళు మూయావలెనన్నా
ముక్తివాకిల నిలిచి తలుపూతీయన్నా
తలుపూ తీసితె అంబ తేజ మిచ్చన్నా
తేజామందినవాడూ తాగురుడోయన్నా
ఈ జన్మమికా దుర్లాభమురా -
ఆరూ పదులా మీద అంబవుందన్నా
అంబాతొ దుర్గాంబ ఆట్లాడురన్నా