పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒరామా నీనామమెంతో రుచిరా
శ్రీరామా నీనామ మెంతో రుచిరా
ఎంతొ రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా" అనేది
అలాంటిదే-
'రామ నామము, రామనామము
 రమ్యమైనది రామనామము" అనే పాట కూడా.
ఎవరైనా 'రామా 'అనకపోతే వారికిఎంతకోపమో! దానినిలా పాటలో
కూడా నిరసిస్తారు.

"శ్రీరామాయననివాడుంటేనేమి పోతేనేమి
అలాంటివాడుంటేనేమి పోతేనేమి" అని
జానపదులకు హరిహర భేధంలేరు-- శివునీ పూజిస్తారు, విష్ణువునీ పూజిస్తారు. అందుకే భజనల్లో -
 
"ఎద్దునెక్కినవాడు లింగడూ, బొల్లి
గద్దెనెక్కినవాడు రంగడూ" అంటూ పరవశంతో పాడతారు.

                         దంపుళ్ళ పాటలు

కర్రతోచేసిన రోటిలోగాని, నేలమీదచేసిన గుంటలోగాని ధాన్యం పోసి అడుగున ఇనుపపన్ను కట్టబడి గుప్పెడులావుగల నాలుగూడుగుల కర్రతోచేయబడ్డ రోకలితో దంచుతారు ఇద్దరుగాని, ముగ్గురుగాని, నలుగురుగాని జానపదస్త్రీలు. ఇవి దంపుళ్ళంటారు. ఒక్కసారిపోసిదంచే ధాన్యాన్ని 'వాయి ' అంటారు. ఈ దంపుడుబియ్యం ఆరోగ్యానికి మంచిది - బలమైంది - 'బి ' విటమిను ఎక్కువ. ఇలా దంచేస్త్రీలు శ్రమతెలియకుండా రోకలిపోటులయకు అనుగుణంగా యిలా పాటలందుకునిపాడుతూ దంచుతారు.

"అత్తా లేని కోడలుత్తమురాలు ఓయమ్మా
కోడలులేని అత్తా గుణవంతురాలూ - ఆహై" చెప్పే
లోకపుతీరు-
        కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓయమ్మా,