పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"పరుగెత్తుబాలుడూ పనసపండుచాయ
శ్రీ సూర్య నారాయణా" అనే ప్రభాత భానుని వర్ణన
"యశోదమ్మా, యశోదమ్మా,
ఏమందునమ్మా నోరాడాదమ్మా
వడివడిగానీ కొడుకు
మదుగులోకి దుమికినాడు" అనె కాళియమర్ధన విశేషాలు
చెప్పే కీర్తనలు కూడా జనాకర్షకమైనవే. చెక్క భజనలో.

"శివశివ మూర్తివి గణనాధా నీవు
శివుని కుమారుడవు గణనాధా" అనే గణపతిప్రార్ధన కూర్చున్న మనిషినిలేపి గంతులేయుస్తుంది. అలాంటిదే కారీచు మాయకుఇ సంబందించిన ఈ క్రిందిపాట.
'చుక్కాచుక్కల్లేడి రాం భజనా
సూదీకొమ్ముల్లేడి రాం భజనా
రాముడొస్తున్నడు రాంభజన
బమిడీకొమ్ముల్లేడి రాం భజనా
బంగారు ఆ లేడి రాం భజనా
మారీచుఆలేడి రాం భజనా
మంత్రమ్ములాలేడి రాం భజనా"
అటువంటిదే--
"ఏదీరా లక్ష్మణా సీ....తా
 పర్ణశాలాలో లేదెందు సే....తా" అనే పాటకూడా.

జానపదులకు రామనామమువీద భక్తి అమితం రామునిపెరు తలచుకుంటేనే పులరించిపోయే జనులెందరో. అందుకే ఆయనకు ఇలాంటి భజనలు - ఆ భజనల్లో ఒళ్ళు మరచిపాడే పాటలు-

"ఓరామా నీనామమెంతో రుచిరా
శ్రీరామ నీనామెంతో రుచిరా
పాలూ మీగడలాకన్నా,
పంచదార చిలకలకన్నా