పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పచ్చిపాలమీద మీగడాలెదే?
వేడిపాలమీద వెన్నేలాలేదె? అనే అత్తసధింపు
అత్తా నువ్వూ పెట్టే ఆరళ్ళేగాని
పచ్చిపాలమీద మీగడుంటుందా
వేడిపాలమీద వెన్నవుంటుందా" అనే కోడలి సమాధానం.

"సువ్వి సువ్వి రామచంద్రా
  సువ్వి సువ్వి కీర్తి సాంద్ర
  సువ్వీ సీతమ్మ మాకు శుభము లియ్యావే ' అంటూ సెతా
రాములఆశీస్సు కోరే పాట-
సువ్వీ కస్తూరి రంగ
సువ్వీ కావేటి రంగ
సువ్వీ రామాభిరామ సువ్వి లాలీ"

"తుమ్మకర్ర రోలుదాసి
 తూముడొడ్లు వామునేసి
 దంచుదామా బియ్యం దంచుదామా"

"ఊరొముందచేను వెయ్యలోకన్నా
  ఊళ్ళోనవియ్యమ్మూ చెయ్యాబోకన్నా
  ఊరిముందర చేను కాకులాపాలూ
  ఊళ్ళోనివియ్యమ్ము కయ్యాలపాలు
  ఆ.... హం....ఆ....హం....

అంటూ జీవిత సత్యాలను పల్లెపడుచులు మాటలపాటల్లో రోకళ్ళతో దంచుతూ ముందు ఒకరు పాడుతుంటే, కూడా దంచేమిగతావారు వంతగా పాడుతుంటారు. మనస్సును ఈపాటమీదా, పాటలోని విషయంమీదా, దాని లయమీదా లగ్నంచేసి దంచుతుంటే దంచడంలోనిశ్రమ వారికి తెలియకుండా పొతుంది. వినే వాళ్ళకి సామాజిక సత్యాలెన్నో రత్నాల్లా రాలి విజ్ఞల్ని చేస్తాయి. ఈ దంపుళ్ళ పాటలనే రోకలిపాటలంటారు. "రోకలిపాటలవల్ల వేదములు కనుగొనుమా శివభక్తులఇండ్ల" అనిబసవ పురాణములో ఉటంకించబడింది - ఇది అంత ప్రాచీనం.