పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒకసారి నరదుడు, తుంబురుడు సంగెతంలో నేను గొప్పంటే నేను గొప్పని పోట్లాడుకుని తీర్పు కోసం ఆంజనేయుడి దగ్గరకు వెళ్ళేరట. ఆంజనేయుడు ఒక రాగం పాడి అక్కడున్న శిలను కరిగించి వారి తంబురనందులో పెట్టి మరో రాగం పాడి మరల శిల చేసివేసి దానిలోంచి ఆ తంబురను తీసికోమన్నాడట. ఎంత శ్రమపడ్డా అదివారి యిద్దరివల్లా కూడా కాలదట. అంటే సంగీతంలో ఆంజనేయుడు అంత గొప్పవాడన్నమాట. ఈ సంగీత స్వరాల మీద నేటి కాలానికి సంబందించి రమాషా అయిన చెణుకులు చాలా వింతుంటాం.

ఒక రాజాగారు ఒక సాని వలలో పడి, రాణిని విస్మరిస్తే ఆరాణీ ఆస్థాన విద్వాంసుడికి మొరపెట్టుకోగా అతడు రాజుమనస్సును సాని వైపునుందింరల్చి ఆరోజు కచేరిలో రాణికి యీ సమాచారం స్వరం ద్వారా యిలా అందించాడట - "సరి, దానిపని సరి, సాని దాని పనిసరి" అని.

ఒకసారి ఒక సంగీత మేష్టారు ఒకమ్మాయికి సంగీత పాఠం చెబుతున్నారట - మాష్ఠారు 'సరిగ్మ ' అన్నారట. ఆ అమ్మాయి 'సరిగమ ' అందట - మాస్థారు 'పద 'అన్నారట - ఆ అమ్మాయి "ఎక్కడికీ? ఉండండి మా నాన్నతో చెబుతా మీసంగతి" అని లేచిపోయి తండ్రిని తీసుకొచ్చిందట.

రాగాల సంగతి తెలియని ఒకసినీనిర్మాతతో సంగీత దర్శకుడు 'అయ్యా! ఈ పదానికి కాపీ రాగం వాడమంటారా? ' అన్నాడట. దానికా ప్రొడ్యూసరు "ఇంత డబ్బు నీకిచ్చింది కాఫీరాగాలు వాడమనా? అదేమీ కుదరదు ' అన్నాడట.

సంగీతం గాత్రమెకాకుండా వాయిద్యాలమీదకూడా అభ్యసిస్తారు. వయిలిన్, వీణ, సన్నాయి, ప్లూటు, మృదంగం, డోలు యిప్పుడు వాడుతున్న శాస్త్రీయ సంగీత వాయిద్యాలు. తెలుగు వారిలో గాత్రానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వీణలో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, వయొలిన్ లో ద్వారం వెంకటస్వామినాయుడు మృదంగంలో యూల్లా వెంకటేశ్వరరాచ్వు, మాందిలిన్ లో మాస్థర్ శ్రీనివాస్ ప్రపంచ ప్రఖ్యాతి పొందడ్ం తెలుగుజానికి గర్వకరణం.