పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లలితసంగీతం

దీనికి శృతిజ్ఞానం, లయజ్ఞానం ఉంటే చాలు. కాకుంటే గాయకునికి చక్కని గాత్రం మాత్రం కావాలి. గేయాలూ, తత్వాలూ, పాటలూ యిందులో ఎక్కువ కనిపిస్తాయి. హార్మోనియం దీనికి బాగా వాడతారు.

                  పాశ్చాత్యసంగీతం

ఫియానో, మేండలిన్ క్లారినెట్ అకార్ధిస్ గిటార్ , డోలక్ డ్రమ్ములు మొదలగునవి వాద్యాలు. బార్ లలోనుఒ, బడా హోటళ్ళలోనూ చిన్ని వెలుతురులో మంద్ర స్థాయ్హిలో యిది నివిపిస్తూండడం కద్దు మత్తు మత్తుగా ఉండడానికి. దీనిలో విచిత్గ్రమైన ఉత్తేజంవుంది. కేబెరా డాన్శులకి, డిస్కోడాన్శుల్కి, బ్రేక్ డాన్శులకి యిది చక్కటి బేగ్రౌండ్, పాశ్ఛాత్య పద్ధతిలో దీనికీ ఒక మీటరుంది. నేటి యువతరం దీనికే ఎక్కువ ఆకర్షింపబదుతుండడం గమనార్హం. దీని ప్రచారం ప్రపంచ వ్యాప్తం.

                    సి ని మా సం గీ తం

చాలావరకు సామాన్యుని రంజింపచేయడమే లక్ష్యంగా కూర్చబడే సంగీతం యిది. అన్ని రకాల వాయిద్యాలూ వాడతారు. కాదేదీ దీనికనర్హం. రాగమిశ్రమాలు, తాళమిశ్రమాలు, శృతిమిశ్రమాలు కోకొల్లలు. అలాగని దీన్ని తేలిగ్గా కొట్టి పారెయ్యడానికి వీల్లేదు. ఆ కూర్చడంలో ఔచిత్యం కూడా ఉంటుంది. గొప్ప గాత్ర మాధుర్యం ఉంటేగాని ప్రతివారూ యిందులో పనికిరారు. ఇందు దేశ ప్రశస్తి పొందినవారు తెలుగువారిలో ఘంటసాల, యస్. పి. బాలసుబ్రహ్మణ్యశర్మ,సుశీల, జానకి మొదలగు వారేందరో ఉన్నారు. ఈ సినిమా పాటల నుకరణతో దేశంలో అనేక మ్యూజిక్ పార్టీలు వెలిసాయి. అందులో రాజమహేంద్రవరం జిత్ మోహన్మిత్రా పార్టీ, చిట్టిబాబు పార్టీలు, కాకినాద గంగాధరం పార్టీ, బాబ్జీ పార్టీలు రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాయి.

ఈనాడు దేశంలో నదుస్తున్న కార్యక్రమాన్ని బట్టి చూస్తే బహు జనాదరణతో సాదుగున్నది సినిమా సంగీతం. ఆ తరువాత లలిత