పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పేరు. దీనిలో పల్లవి, అనుపల్లవి, చరణాలు ఉంటాయి. సాహిత్యముండదు. కాని ఈ మధ్య 'రారవేణు గోపబాల, రాజిత సద్గుణ జయశీలో వంటివి వినవస్తున్నాయి.

                        స్వరజతులు

స్వర జతులలో పల్లవి, చరణాలు ఉంటాయి. సాహిత్యముంటుంది. సాహిత్యం భక్తిరసంతో గాని, వీర రసంతోగాని, శృంగార రసంతోగాని నిండి ఉంటుంది. "సాంబశివాయనవే" అనేది దీనికి ఉదాహరణ.

ఈ ప్రక్రియలన్నిటికీ శ్రుతితోపాటు తాళంకూడా ముఖ్యం. 'శ్రుతిర్మాతా లయ: పిత: ' అన్నారు. శ్రుతి తల్లి లాంటిది. లయ తండ్రిలాంటిది. లయ అంటే తాళం, విలంబనకాల ప్రమాణాన్ని బట్టి తాళాన్ని చరురశ్ర, తిశ్ర, మిశ్ర, ఖండ సంకీర్ణాలని అయిదుజాతులుగా విభజించారు. ప్రతిజాతిలోనూ మరల ధ్రువ, మధ్య, రూపక, జంపు, త్రిపుట, ఆట, ఏక అని తాళాలుంటాయి. సంగీత సభలలో తాళం చేత్తో ఎడక్మచేతిమీద వేస్తుండడం చూస్తుంటాం. ఒక దెబ్బ చేతిమీద కొట్తి, ఒకదెబ్బ వనక్కి గాలిలోకి విసిరితే ఆ చేతి మీద కొట్టిన దెబ్బకు 'ఘాత ' మనీ, గాలిలోనికి విసిరిన దానికి 'ఉసి ' అనీ సంగీతంలో సాంకేతికమైన పేర్లు. తాళాలన్నీ ఈ పరిభాషలోనే తెలుపుతారు. ఈ తాళానికి షట్కాలాలు చెప్పబడినా ఇప్పుడు నాలుగు కాలాలలోనే నడుపుతున్నారు. 'సరిగమ పదనిస ' అనే అక్షరాలు నడిపే వేగాన్ని కాలం అంటారు. మొదటి కాలంలో ఒక్క దెబ్బమీద ఒక్క అక్షరమే నడపబడుతుంది. అంటే ఒక దెబ్బమీద రెండక్షరాలూ, మూడవకాలంలో నాలుగక్షరాలూ, నలుగవ కాలంలొ ఎనిమిదక్షరాలూ నడపబడతాయి. అంటే కాలం పెరిగే కొద్దీ స్వరం వేగం పుంజుకుంటుందన్నమాట.

శాస్త్రీయ సంగీతానికి చాలా సాధన కావాలి. పూర్వం గాయకులు తెల్లవారు జామున గడగడ వణికించే చలిలో కుండనిండా చల్లని నీళ్ళు పోసి దానిని కావలించుకుని అకారసధనచేసేవారట గాత్ర సౌలభ్యంకోసం, కొంద్రు చెరువులలో పీకలలోతు నీటిలో అభ్యాసం చేసేవారు. ఆ కాలంలో మేఘరంజనీగానం పా డితే వర్షాలు కురిసేవట.