పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఫీళ్ళారీ గీతాలు

పిళ్ళారీ గీతాలలో స్వరం సాహిత్యంలో ప్రవేశిస్తుంది. ఉదాహరణకు 'సరిమాగరి సరిగరిస ' అనే స్వరాబుజు 'లంబోదర లకు మికరా ' అనే పాట కూర్చారు. ఇవి ఎక్కువ గణపతి పరంగానే వ్రాసినవి గనుక వీనిని పిళ్ళారి గీతాలన్నారు. 'పిళ్ళారై ' అంటే గణపతి.

                            వ ర్ణా లు

వర్ణాలలో -పల్లవి, అనుపల్లవి, చరణం, స్వరం ఉంటాయి. ఇవి శృంగార రస ప్రధానంగా వ్రాసినవి. అందువల్ల మేజువాణీల్లో ఎక్కువ పాడేవరు. "సామి నిన్నే కోరి చాలా మరులు కొన్నదిరా" వంటివి వర్ణాలు.

                           కృ తు లు

కృతిలో - ప్రక్రియ అంతా వర్ణంలాగే ఉంటుంది. భావం మాత్రం భగవంతుని పరంగా ఉంటుంది. దీని గతి సంగతులతోను, గ్ఫమకాలతోను కూడి నడుస్తుంది. సంగతులంటే పాడేటప్పుడు మధ్య మధ్య రంజకత్వానికై రాగతాళాలను అనుసరిస్తూనే భావ స్ంపత్తిలో హెచ్చు తగ్గులు చూపడం. గమకమంటే రకరకాల ఊపుల్లో వినువారికింపు కలిగించేటట్టు పదాలు విరుస్తూ చేసే విన్యాసం. ముద్దుస్వామి దీక్షితులు గారి 'వాతాపి గణపతింభజే ' అనేది, 'సామజ వరగమనా ', 'మరుగేలరా ఓ రాఘవా ', 'ఎందరో మహానుభావులు ' వంటి త్యాగరాజ కృతులు దీనికుదాహరణలు.

                                  కీ ర్త న లు

కీర్తన పల్లవి, చరణం కలిగి మధురమైన సంగీతరచన కలిగి ఉంటుంది. సాహిత్యం భక్తిప్రధానం. సదాశివ బ్రహ్మేంద్రము గారి 'మానవ సంచరరే బ్రహ్మణి ' అనేది, 'పలుకే బంగారమాయెనా ' వంటి రామదారు కీర్తనలూ ఇందుకుదాహరణలు.