పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త రం గా లు

భక్తి శృంగార రస ప్రధానంగాఉంటాయి తరంగాలు. ఇందు కృష్ణలీలలు వర్ణీతాలు. నరాయణతీర్ధులవారి "కృష్ణలీలాతరంగిణి"లోనివన్నీ తరంగాలే. బహుళ ప్రాచుర్యం పొందిన 'బాల గోపాల ' తరంగం దీనిలోదే.

                       ప ద ము లు

దేవతా సంబంధమై, శృంగార రస ప్రధానంగా నాయికా నాయక లక్షణాలకు సంబంధించి వుంటాయి పదములు. 'ఇంత రాపు చేసితే నేతెట్టులోర్తునే ఇంతి ' వంటి క్షేత్రయ్య మువ్వగోపాలపదాలు ఇందు కుదాహరణలు. ఘనం శీనయ్యగారి "శివదీక్షా పరురాలనురా" అనే పదం అందరూ ఎరిగినదే.

                        అష్టపదులు

అష్టపదులు శృంగారరస ప్రధానం. ఇందులో అన్నీ చరణాలే. ఇవి ఎనిమిది పాదాలుగా ఉంటాయి. అందుకే అష్టపది అన్నారు. ఇవన్నీ జయదేవుమ్ని "గీతగోవిందం" లోనివి. విద్యాంసులందరి నోటా విరివిగా వినబడే 'చందన చర్చిత నీల కళేబర పీత వ్సన వనమాలీ" అనేది ఒక అష్టపది.

                        జా వ ళీ లు

జావళీలు పదముల వలెనే శృంగార రసంతో, నాయికా నాయక లక్షణాలతో నిండి గ్రామ్యభాషాపదబంధంకలిగి ఉంటాయి. మనందరికీ చిరపరిచతమైన "మదురా నగరిలో చల్లలమ్మ బోదు" అనేది జావళీయే. ఇవిగాక అభ్యాస గతిలో జతిస్వరాలు, స్వరజతులు అనేవి ఉంటాయి. ఇవి పిళ్ళారీ గీతాల తరువాత చెబుతారు.

                            జతిస్వరాలు

నృత్యానికి అనుగుణంగా జతులుంటాయి. జతులంటే 'తకిట తక ధిమిత తకిట తధికిణతోం ' లాంటివి. దీనికే స్వర పల్లవి అనికూడా మరో