పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3, ప్రాశ్చాత్య సంగీతం 4. సినిమా సంగీతం

                          శా స్త్రీ య సం గీ తం

ఇదే మరల కర్నాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం అని రెండు పాయలుగా ప్రవహిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల వారి బాణీ కర్నాటక సంగీతం. ఉత్తరాది వారి బాణీ హిందూస్తానీ, సంగీతంలో స్థాయీ భేదాలు మూడు. దీనినే 'త్రిస్థాయి ' అంటారు. మందరం, మధ్యమం, తార, మందరానికి హృదయం, మధ్యమానికి కంఠం, తారకు మూర్ధము స్థానములు. 'శ్రుతిలేని పాట మతిలేని మాట ' అని సామెత. దీనిని బట్తి సంగీతంలో శ్రితికి ప్రాధాన్యమెంతటిదో గ్రహింపవచ్చు. ఈ శృతిని సాధన చేసే ఉపకరణాలు స.ప.స.లు. ఇవిషడ్జమం 'న ', పంచమం 'ప ', తారాస్థాయి 'స ' లు.

శాస్త్రీయ సంగీతానికి స్ఫ్గరం ప్రాణం, రాగం దేహం, సంపూర్ణస్వరం కలిగిన రాగాలను "మేళ కర్త" అంటారు. వీనిలో సరిగమపదనిసలు పూర్తిగా ఉంటాయి. ఈ మేళ కర్తలు 72.. మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఇవి మూలరాగాలన్నమాట. వీని నుంచి కొన్ని స్థాయిలు లోపించి ఉద్భవించిన వానిని జన్యరాగాలంటారు. అంటే వీటిలో స రి గ మ ప ద ని స లు అన్నీవుండవు. ఉదాహరణకు 'స రి గ స ద సా ప ద ప గ రి సా ' అనే మోహ రాగంలో 'మ ' 'ని 'లు లుప్తం. అందువల్ల ఇది జన్య రాగం. దీనికి 'మేళకర్త ' హరి కాంభోజి, ఈ జన్య రాగాలు లెక్కకు మిక్కుటం - కాని వాదుకలో ఉన్నవి యించుమించు వందలోపు మాత్రమే. శాస్త్రకారులు యీ సంగీతంలోని గీతాలను, వానిలోని స్థితిగతులనుబట్టి స్థూలంగా పిళ్ళారీ గీతాలు, వర్ణాలు, కృతులు, కీర్తనలు, పదాలు, అష్టపదులు, జావళీలు అని విభజించారు.

                     సరళీ స్వరాలు

సరళీ స్వరాలలో సాహిత్యముండదు. పూర్తిగా స్వరసంచారమే స్వరసంచారమంటే ఆ రాగంలో ఉండేస్వరాన్ని పైనుంచిక్రిందికి, క్రిందినుంచి పైకి భిన్నగతులలో ఆలాపన చేయడం. ఉదాహరణకు "సరిగమ స్రిగమ సరిగమ పదనిస, సనిదవ సనిదవ సనిదవ మగరిస"