పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం' అన్నారు పెద్దలు. దీనికోసం వారు ఒకవేడాన్నే సృష్టించారు. "సామ వేదసారము సంగీతము సాహిత్యమేగా!' సామవేదంలో సంగీత మర్మాలన్నీ వివరించబడ్డాయి. ఆధునిక సంగీత దృశ్యకావ్యమైన 'కంఠాణ్భరణం ' లొని "అద్త్విత సిద్దికి అమరత్వలంబ్దికి గానమె సోపానము...,' అనేమాట అక్షరసత్యం. త్యాగరాజాదులు గానంతోనేగా తరించారు; ప్రపంచంలొ కుల మత వర్ణ వర్గ భాషా భేదాల కతీతమైనది సంగీతం. మొత్తం ప్రాణికోటిపై దీని ప్రభావం అపారం. 'శిశుర్వేత్తి, పశిర్వేత్తిగాన రసం ఫణిక ' శిశువులూ, పశువులూ, పాములూ కూడ సంగీతానికి పరవశిస్తాయట. నిజమే 'జొ అచ్యుతానద జొజో ముకుండా' అని జోల పాడితే పరశించి పసిపాప తల్లిఒడిలో నిదురపోతుంది. కృష్ణుని మురేళీ రవాన్ని పశువులు పరవశించి వినేవని పురాణాలు చెబుతున్నాయి. నాగస్వరం ఊదుతుంటే నాగుబాము పడగ విప్పి ఆడటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య పరిశోధకులు చెబుతున్న కొత్త విషయం ఏమిటంటే సంగీతం వినిపిస్తుంటే పశువులు పాలెక్కువవిస్తున్నాయట, పంటలు బాగా పండుతున్నాయట. ఈ రాగాలతో ఎన్నో రోగాలుకూడా పోగొట్టువచ్చునంటున్నారు పాట్నాకి చెందిన డాక్టర్ వింధ్యాచర్ త్రిపాఠీ. అయితే అవి "ఆరేసుకోబోయి పారేసుకున్నాను లాంటి పాటలు కాకపోవచ్చు " ఎన్నిక చేసిన చక్కని సంగీతం ద్వారా అనేక రోగాలను నయం చేయవచ్చునని ఈ రాగాల డాక్టరు పరిశోధనలో తేలిందట. ప్రపంచంలో గాలి పీల్చని ప్రాణి లేనట్లే కూని రాగం తీయని మానవుడు ఉండడు. దీనికి అనురక్తుడు కానివాడెవడైనా ఉంటే అతడు జడముతో సమానమన్నాడు మహాకవి 'షేక్స్ పియర్ ' "మర్చంటప్ వెన్నీస్" నాటకంలొ.

నిబద్ద సంగీతమని, అనిబద్ధ సంగీతమని సంగీతం రెండు విధాలు. ఈ నిబద్ధ సంగీతాన్నే శాస్త్రీయ సంగీతమని పిలుస్తారు. ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఉధృతంగా సాగుతున్న సంగీత స్రఫంతిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. 1. శాస్త్రీయ సంగీతం 2. లలిత సంగీతం