పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇందులో విజ్ఞానఫంతుడైన మానవుడు ఈ కూతలను, అరుపులను, ధ్వన్లను, శ్రుబద్ధం చేసి సప్త స్వరాలుగా స్వీకరించాడు. అవే సరిగమలు, సప్తస్వరాలు అంటే ఏడు స్థాయిలలో వినిపించే నాద భేదం, వీనికి షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, విషాదం అనిపేర్లు. ఈ పదాలు మొదటి అక్షరాలే 'సరిగమ పదని ' అనేవి. ('ష 'కు బదులు సరళ ఊష్మం స వాడారంతే) షడ్జమం అంటే నెమలి కూత, సిషభం అంటే వృషభం ధ్వని, గాందారం అంటే చింబోతు (మేకపోతు అరుపు) మధ్యమం అంటే క్రౌంచపక్షి లేక బాతు పలుకు, పంచమం అంటే కోకిల రవం, దైవతం అంటే గుర్రపు సకిలింపు, నిషాదం అంటే ఋనుగు ఘీంకారం. ఇవి నాభీహృత్కంఠ రస నాసాదుల యందు ఉద్బవిస్తాయి.

ఈ స్వరాల ఆరోహణ అవరోహణ క్రమాల భిన్న త్వాన్నిబట్టి రాగాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకి 'సరిగమ పదనిస, సనిదప మగరిస ' అనే స్వరం 'మాయా మాళవ గౌళ ' రాగం అనీ, సరిగ పదసా సదప గరిసా ' అనే స్వర గరిని 'మోహన ' రాగం అనీ యిలా స్వర భేదాన్ని బట్టి వివిధ్ రకాలుగా విభజించి విదిధ రాగాల పేర్లు పెట్టారు. బాగా ఆలోచించిచూస్తే చాలవరకు ఈ రాగాల పేర్లు ఆ స్వరం ప్రసిద్ధి పొందిన ప్రాంతం పేరుదో, ఆ రాగంలో ఉండే గుణం పేరు మీదో, లేక ఆ రాగాన్ని సృస్థించిన వ్యక్తిపేరు మీదో ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు భూపాల, (నేటిభోపాల్) కాంభోజ, (కంబోడియా/కంపూచియా) గాంధార, (ఆప్ఘనిస్తాన్ లోని కాందహార్) కన్నడ అనేవి భారత ఇతర దేశాల్లోని కొన్ని ప్రాంతాల పేర్లు. మోహన, హంసధ్వని, కామవర్ధని, మేఘరంజని అనేవి గుణముల పేర్లు, కళావతి, రత్నాంగి, కనకాంగి, నీలవేణి, కళ్యాణి అనేవి వ్యక్తుల పేర్లు. విశిష్ట వ్యక్తులమీద గౌరవంతో రాగాలను ఆయా వ్యక్తుల పేర్లు పెట్టడం కూడా కద్దు. ఈ మధ్య శ్రీమతి ఇందిరాగాంధీ పేరుమీద 'ప్రియదర్శిని ' అని క్రొత్తరాగాన్ని సృష్టించడం మనందరికీ తెలిసిందే. ఈ రాగాలు స్థితి ప్రేరకాలు, రస ప్రవాహాకాలు; ముఖాది,సావేరి, అసావేరి, శహనా వంటి రాగాలు విషాదాన్ని ఒలకబొస్తే భైరవి, శ్రీరాగం, అఠాణాలాంటివి ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తీకరిస్తే, ఆనంద బైరవి, శ్యామ వంటివి శాంతభావాన్ని ఉద్దీపింపజేస్తాయి.