పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కల్పిస్తుంది. ఎక్కువ మంది ముఖం మీద బొట్టుగా వేయించుకుంటారు. అందుకే దానిని పచ్చబొట్టు అంటారు. ఇది శాశ్వతమైనది. తుడిచినా పోదు. చెరిపినా చెరగదు. ఆషాడమాసంలో చేతులకు స్త్రీలు పెట్టుకొనే గోరింటాకు కూడా చిత్రకళ సంబంధితమే. అరి చేతిమీద వీరు పద్మరూపంలోనూ, కలువరూపంలోనూ, అర్ధ చంద్రాకృతిలోనూ వివిధమగు చిత్రాలు అద్భుతంగా వేస్తారు. ఇవే గాక రోడ్లపైన మసిబొగ్గుతో వేంకటేశ్వరస్వామి, ఏసుక్రీస్తు, ఆంజనేయస్వామి వంటి బొమ్మలు గీస్తూ పిచ్చివాడిలా కనిపించే కళాకారుడు కూడా జానపద చిత్రకారుడే.

ఇక పెండ్లిండ్లకు, పండగలకు పల్లె పడుచులు యింటి ముంగిళ్ళలోనూ, వాకిళ్ళలోనూ వీధుల్లోనూ తీర్చి దిద్దే రంగవల్లులు జానపద చిత్రకళకు పట్టే నీరాజనాలే. ఈ ముగుల్లో పువ్వులు, ఆకులు, లతలు, చెట్లు, దేవాలయాలు, రధాలు, సూర్యచంద్రాదులు, చిలకలు, పక్షులు మొదలగు ప్రకృతి సంబంధిత రూపములు పచ్చ నీలం, పసుపు వగైరా రకరకాల రంగులతో మనోహరంగా తీర్చి దిద్దుతారు. తోలుబొమ్మలాటల వారు తయారు చేసే బొమ్మలు కూడా జానపద కళాకారెఉని ప్రావీణ్యతను బయట పెట్టే సృష్టి. ఇందు అతని చిత్ర లేఖనా నైపుణ్యం అద్భుతం అని చెప్పాలి.

                    సం గీ తం

సృష్టికి ముందు నాదం పుట్టింది. అదే 'ఓం అనే ప్రణవం ' Silence is un-natural to man" అంటాడు 'లిండ్ '. అంటేమనిషి నిశ్శబ్ధాన్ని భరించలేడన్నమాట. అందుకే అర్ధరాత్రి మనిషికి భయం. మానవుడు ఆదినుండీ సుఖ, దు:ఖ, భయ, సంతోషాలతో నవ్వాడు, ఏడ్చాడు, అరిచాడు, పిలిచాడు; ఈ శంబ్దాల ఆరోహణావరోహణ క్రమస్వరూపమే సంగీతమయింది. మానడే కాకుండా ప్రకృతిలో ప్రతి జీవీ శబ్దం చేస్తుందని ఈ మధ్య శాస్త్రజ్ఞల పరిశోధనలలో బయటపడించి. జంతువుల అరుపులు, పిట్టల కూతలు, క్రిమికీటకాలు చేసే శబ్ధాలు అందరికీ వినబడేవే కాని, వృక్షాలుకూడా సంగీతం పాడతాయనీ, వింటాయనీ వృక్ష శాస్త్రజ్ఞలు కనుగొన్నారు.