పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాళహస్తి గుడిలో ప్రవేశించగానే ఏదో అలౌకికానందం కలుగుతుంది. ఆ మండపాలూ, ఆ స్తంభాలూ ఆకట్టడాలూ మన ఊహల్ని ఎక్కడికో తీసుకుపోతాయి. ఇక విజయూవాడ దగ్గర గల ఉండవల్లి గుహలలోని శేషశాయి విగ్రహం కూడా చూడదగ్గ విశేషమే. నిజానికి తెలుగునాట పలుమూలలా పల్లెల్లో కనిపించే పోతురాజులూ, పోలేరమ్మలూ చాలవరకు మన ప్రాచ్ఫీన శిల్పసంపద అవశేషాలే.

ప్రపంచ ప్రఖ్య్హాతి బడసిన మహాబలిపురం ఏకశిలారధాలు, అజంతాగుహల అదినిర్మిత అద్బుత శిల్పాల, హంపి విజయనగర మహోన్నత రాతి ప్రతిమలు, సాంచీస్థూప ద్వారతోరణాలు,. కోణార్కం, భువనేశ్వరాల జీవ శిల్ప కళామూర్తులు ఆంధ్రశిల్పుల ఉలి మెరుగులే. ఇంత కళానైపుణ్యం చిందించిన యీ మహాశిల్పులు ఎవరు? వారి నామ రూపాలేమి? అంతా అజ్ఞాతమే. అందుకే యివి దేవతల నిర్మాణాలని కధలు వింటుంటాం. నిజానికి పేరుకాశించని మానవ దేవతలు వీళ్ళు. మహా కవి శ్రీ శ్రీ "తాజమహలు నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?" అన్నదానిలోని కూలీలు యీ అజ్ఞాత శిల్పులే. అసలు తాజమహలు నిర్మించింది కూడా తెలుగు శిల్పులేనట. జాషువాగారు యీ విషయాన్ని తమ "తాజమహలు" ఖండకావ్యంలో యిలా వివరించారు-

"మగని ఱొమ్మున కుంపటి రగులబెట్టి
 కాయము త్యజించెనే మొగలాయిదాడి
 తెలుగు శిల్పుల పనివానితనము నొకట
 కుప్పవోయింప వ్లె ననుకొనియెనేమొ!"

తూర్పుగోదావ్రిలో ద్రాక్షారామ దేవాలయంలోనే గాక సామర్లకోట దగ్గర భీమవరం, సర్పవరం,బిక్కవోలు మొదలగు గ్రామాలలో గల గుడులలోకూడా అపురూపమైన శిల్ప కళా సంపద వెల్లివిరుస్తోంది.

పైకి కనిపించే వివేగాకుండా భూగర్భంలో యింకా ఎన్ని కళాఖండాలు దాక్కున్నాయో! త్రవాకాలతో వెలికి తీయించి ప్రదర్శన శాలల్లో పదిలపరచుట పురావస్తుశాఖవారి విధి. ఈ శిలా ప్రతిమలెన్నో పరపరిపాలనలో విదేశాలకు తరలింప బడ్డాయి. స్వాతంత్ర్యానంతరం వీని గిరాకి మరింత పెరిగి చోరులచే తస్కరింపబడి వెదేశాలకు రహస్యంగా