పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సిం హా చ లం

కళింగాధ్రలో విశాఖకు 9 మళ్ళదూరంలో కొండమీద వెలసిన పుణ్యక్షేత్రమిది. కళింగాంగగంగుల ఆదరణతో ఆవిర్భవించిన అద్భుత శిల్పం యీగుడిలోనిది. గుడిలోని దేవుడు వరాహనరసింహస్వామి నిత్య చందనాలంకృతుడు. ఇక్కది శిల్పాలతో విశేషంగా కనబడేది వివిధ బంధనాలలో మైధున ప్రతిమలు. చతుష్షష్ఠికళల్లోరతికూడా ఒక కళగా భావించిన పూర్ఫులు శిల్పంలో కూడా దీనికి స్థానం యిచ్చి ఆనందింప చేశారు. ఇవి జీవకళామూర్తులు. హిరణ్య కశిపుని పొట్ట చీల్చుచున్న ఉగ్రనరసింహమూర్తి, నరహావతార రూపం శిల్పాలు చూసేమనిషిని నిలేస్తాయి. అన్నిటికీ మించి యిక్కడి శిలా మండప స్తంభాలమీది శిల్పం అత్యంత మనోహరం. వీనిపై దశావతారాలు, భిన్న నరసింహమూర్తుఇలూ సుందరాంగుల నాట్యముద్రలూ, లతలూ నేత్రపర్వం. రధ మండపానికి కూర్చిన ఆశ్వాలు మన హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకుంటాయి. కళ్యాణమండపం 843 స్తంభాలతో నిర్మించారు. ఈ స్థంబాలు మ్రోగిస్తే సరిగమలు పలుకుతాయంటారు. శిల్పి ఎంత మర్మజ్ఞడో మది!

                      ద్రా క్షా రా మ

చాళుక్యుల అండదండలతో నిర్మించబడిన భీమేశ్వరాలయంలో శిల్ప ప్రత్యేకతకంటె రాతి కట్టడపు పని, గోపుర ప్రాకారాలు, వివిధ దేవతల ఉనికీ మనికీ ఛూడవలసిందే ఈ గుడి దేవతలు ఒక్క రాత్రిలో కట్టేరని జనశ్రుతి - అంటే యిది దేవతా నిర్మాణం లాగుంటుందన్న మాట. ఇందులోని భీమేశ్వరలింగం రెండు నిలువుల ఎత్తు వుంటుంది. ఈపాటి నిడివిలింగం తంజావూరు బృహదీశ్వరాలయంలోనూ, అమరావతి అమరేశ్వరాలయంలోనూ మాత్రమే కనిపిస్తుంది. పైగా ఇది ఒకవైపు తెలువు, ఒకవైపు నలుపు. నలుపు భాగం ఈశ్వరుడనీ, తెలుపుభాగం పార్వతి అనీ, అర్ధనారీశ్వర లింగంగా గుర్తించ బడింది. అందుకే అభిషెకజలం నలుపు వైపె వెళుతుందట (ఈశ్వరుని వైపు)

                               శ్రీ శై లం - కా ళ హ స్తి

"శ్రీశైలం శికరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే" అంటారు. ముక్తి మాట ఎట్లావున్నా యిక్కడి శిల్ప కళకు ముగ్ధులు కాని వారుండరు.