పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రవాణా కాబడుతున్నాయి. దీనినరికట్టి ఇతరదేశాల్లోనూ, ఇత్ర రాష్ట్రాల్లోనూ ఉన్న మన శిల్ప సంపదను తిరిగి తెప్పించుట తెలుగు ప్రభుత్వ కర్తవ్యం.

                      జానపద శిల్పం

శిలలతోనూ మట్టితోనూ కొయ్యతోనూ చేసే బొమ్మలన్నీ జానపద కళకారుని సృష్టియే. దేవతా విగ్రహాలు, వాహనాలు, దేవాలయాల మీద మకర తోరణాలు, మిధిన ప్రతిమలు, ఇతర బొమ్మలు, ధ్వజస్ధంభాలు, తులసి కోటలు, సమాధులమీది శిల్పం, పాత్రలమీది డిజైన్లు, వెండి బంగారు ఆభరణములమీద చెక్కడాలు, ధనికుల భవంతుల మీద చెక్కబడే శిల్పాలు జానపద కళాఖండాలే. పల్లెలలో విశ్వబ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, తాపీ పనివారు ఈ శిల్ప కళా ప్రవీణులు.

                             చిత్ర లేఖనం

ఆది మానవుడు తన భావాల్ని వ్య్హక్తం చెయ్యడానికి నాలుగుపద్దతులవలంబించాడు. నోటితో అరిచాడు, గొంతుతో కూశాడు, చేతితో సంజ్ఞలు ఛెశాడు. పసరులతో బొమ్మలుగీశాడు. అరుపు సాహిత్యమయింది. కూత సంగీతమయుంది. సంజ్ఞ నాట్యమయింది. బొమ్మ చిత్రలేకనమయింది. అనే లలిత కళలు; వీనిలో సాహిత్యం చిత్రలేఖనాల పరస్పర సంబంధాన్ని గూర్చి ఒక కవి యిలా అన్నారు;

"కవిత్వం మాట్లాడే చిత్తరువు
 చిత్తరువు మూగపోయిన కవిత"

ఆదిలో చిత్రలేఖనం ప్రకృతి ఆరాధనలో కనిపిస్తుంది. ఆనాటి మానవుని నిత్యజీవితం అడవిజంతువులవేట. అందుకే లేడిని బాణంతోనో, వన్యమృగాన్ని ఈటెతోనో కొడుతున్న ఆదిమవాసి, పులితో బాహాబాహి పోరాడుతున్న ప్రాక్తనమానవుడు, వనసౌందర్యాల్ని చూపే వృక్షాలు యివి మన మొదటి చిత్రలేకనాలు.

వైదిక కాలం నాటికి దేవతారాధన వచ్చింది. చిత్రలేఖనంలో కూడ దేవుడి బొమ్మలు రావలసి వచ్చింది. ఆయితే యీ దేవుళ్ళ నెలా