పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరిష్టాటిల్ కళలను Fine Arts అనీ, Useful Arts అనీ రెండుగా విభజించాడు. ఆయన దృష్టిలో Fine Arts అంటే యివి.

1. Music 2 Drama 3 poetry 4 Sculpture 5 Agriculture

Useful Arts - అంటే ఇంజనీరింగ్, వడ్రంగం, కమ్మరం, కుమ్మరం వగైరాలు. Fine Artsకి ఆందాన్నందించడం ప్రధాన గుణం. Useful Arts ఆనంద జనకము కూడా కావచ్చు. ఉదాహరణకు కుమ్మరం, వడ్రంగం వంటి వానిలో వారు తయరుచేసిన వస్తులపై చెక్కు నగిషీలు ఆనంద జనకములే గదా! ఫైన్ ఆర్ట్సు ముఖ్యంగా ఆనంద జనకములే. వీనిలో జీవితోపయోగం కూడా ఉండవచ్చు. ఉదాహ్రణకు ఒక శిల్పి చక్కని శిల్పాన్ని చెక్కుతాదు. చూపరులకు ఆనందం కలిగించడం దాని ప్రమ ప్రయోజనం. అది అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంది. అయినా ఈ అమ్ముడుపోవడమనేది ఔపచారికం. భారతీయ పండితులు కళలు 34 అన్నారు. T, వత్సాయన కామసూత్రమందలి చత ష్షష్ఠి కళా వివరణమును యీ క్రింది దహరించుచున్నాను. (శ్రీ మేడిచర్ల ఆంజనేయశాస్త్రి గారి అనువాదము)

1. గీతము - ఇది స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయప్రధానముగా, మనస్సుయొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునదిగానుండును.

2. వాద్యము:- ఇది తత - ఘన - అవనద్ధ సుషిరబేదములచే నాలుగు విధములు.

3. నృత్యముజ్ - భావాభినయము

4. అలేఖ్యము - చిత్రలేఖనము

5.విశేషకచ్చేధ్యము - తిలక - వత్రభంగాది రచన

6.తండుల కుసుమ బలివికారములు-బియ్యపు పిండితో, పూలతో భూత తృప్తి కొరకు పెట్టెడి ముగ్గులు.


T ""నాట్యశాస్త్రము అనువాదము" పు.692-701 డా|| పోణింగి శ్రీరామ అప్పారావు.