పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళళూ - వాణీలోని తరగతులు

                    "యోగ: కర్మము కేశలమ్"
                               ---గీత

ఏ విద్యయూందైనా సరే ప్రదర్శింపబడే కౌశలాన్ని కళ అంటారు - ఇక్కడ కౌశ్?అలమనగా నైపుణ్యం. ఈ నైపుణ్యం వ్యక్తి మేధాశక్తి నుండి ఉద్బవిస్తుంది. ఇద్ సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో కావచ్చు, లేదా సృష్టికి మించినస్ సృష్టి చేయడంలో కావచ్చు - కళల గురించి పండితులు యీ క్రింది రీతి నిర్వచించారు.

T "కళ అన్నది మానవబుద్ది జన్యమై, చాతురీ
   మహితమై, సృష్టికి ప్రతిరూపమై భావించే రూప
   విశేషం. అంటే ప్రతి కళలోనూ మనుష్యుని పని
   తనం, బుద్ధి వైశద్యం వెల్లది కావలసివుంది.
   అట్లా ఉంటేనే అది కళ అనిపించుకుంటుంది"

TT "సృష్టియందతర్ని హితమైనున్న సంపూర్ణత్వ
     మును సౌందర్య సునిశిత సత్యరూపమును అభి
     వ్యక్తపరచు సాధన సంపత్తియే కళలు"
     "Art is imitation"
     (కళ అనుకరణ0
     ఇక్కడ అనుకరణ అంటే ప్రకృత్యానుకరణ
                              'అరిస్టాటిల్ '
     "Art is an interpretation, not an imitation"
     (కళ అనుకరణ కాదు, వివరణ) -'ఆర్ధర్ డేవింగ్ '

అనుకరణ కళ అయితే చాయాగ్రహణం ఉత్తమ కళ కావలసి ఉంటుంది. కారణం ఇది యధాతధంగా గ్రహిస్తుంది గనుక. కాని దీని నెవ్వరూ కళగా భావించలేరు గనుక అనుకరణే కళకాదని వీరి మతం.


T జానపదగేయాలు - సాంఘికచరిత్ర (పీఠికనుండి)

  డా. బిరుదురామరాజు, డా.నాయని కృష్ణకుమారి.

TT "నాట్యకళ" ఫిబ్రవరి - మార్చి 1970 సంచిక సంపాదకీయం నుండి గ్రహింపబడినది.