పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7. పుష్పాస్తరణము - పూల శయ్యలను, ఆసనములను ఏర్పరుచుట.

8. దశసనప సనాంగరాగము - దంతములకు, వస్త్రములకు రంగులు అద్దుట.

9. మణిభూమి కాకర్మ - మణులతో బొమ్మలను నిర్మించుట.

10. శయనరచనము - ఋతువులను శీతోష్ణ ఫరిస్థులను అనుసరించి శయ్యలను కూర్చుట.

11.ఉదక వాద్యము - జలతరంగిణీ.

12. ఉదకాఘాతము - పిచికారుతో నీరు చిమ్ముట (వస్దంతకేళియందు)

13. చిత్రయోగములు - రకరకముల వేషములతో సంచరించుట.

14. మాల్యగ్రదన వికల్పములు:- చిత్రవిచిత్రములైన పూలమాలికలను కూర్చుట.

15. శేఖరకీ పీడయోజనము:- పూలతో కిరీటమును, తలచుట్టును అలంకరించుకొనెడి పూలనగిషీని కూర్చుట.

16. నేపద్యయోగములు - అలంకరణ విధానములు

17. కర్ణపత్ర భంగములు - ఏనుగు దంతముతోను, శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట.

18.గంధయుక్త:- అత్తరువులు మొదలగునవి చేసెడు నేర్పు.

19.భూషణయోజనము:- సొమ్ములు పెట్టుకొను విధానము.

20. ఇంద్రజాలములు:- చూపరుల కనులను భ్రమింపజేయుట.

21.కీచుమారయోగము:- సుభగం కరణాది యోగములు.

22.హస్తల్లఘవము:- చెతులలో ఉన్న వస్తువులను మాయంచేఉట.

23. విచిత్రశాఖ యూషభక్ష్య వికారయలు:- రకరకముల తినుబండారముల వండుట.

24.పానకరసరాగ స్వయోజనము:- పానకములు, మద్యములు చేయుట.

25. సూచీవానకర్మ:- గుడ్డలు కిట్టుట

26. సూత్రక్రీడ:- దారములను ముక్కలుచేసి, కాల్చి, మరల మామూలుగా చూపుట.

27. వీణాడమరుక వాద్యములు:- ఈ వాద్యములందు మంచినేర్పు.

28. ప్రహేళీకలు:- సామాన్యార్ధము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన అర్ధము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట.