పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పె ళ్ళి ళ్ళు

వీళ్ళ పెళ్ళిళ్ళ వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది. ఆడా, మగా, పెద్దా, చిన్నా అంతా సంతలకీ, తీర్దాలకీ వెళుతుంటారు. ఆదారిలో యువతీ యువకులు ప్రేంచుకోడాలు, యువతిని యువకుడు ఎత్తుకు పోవడం ఆ తరువాత ఆవైపు పెద్దలూ, యీ వైపు పెద్దలూ చేరి సఖ్యపరచి పెళ్ళి చెయ్యడం- ఇదీ పద్ధతి. వీళ్ళు ఓలిగా గాడిదల్నీ, పందుల్నీయిస్తారు. ఇదేగా వారి సంపద మరి: వీరిలోవ్యచారం తప్పుకాడు. అందుకే వీరిలో హత్యలుండవు. విడిపోవాలనుకుంటే గూడెం నాయకుది దగ్గరతగువేత్తుకుంటేచాలు. అతను తప్పేసి విడాకులిప్పిస్తాడు. మరల వాళ్ళు తమకిష్టమైనవాళ్ళను పెళ్ళిచేసుకోవచ్చు. తప్పంటే జరిమానా. ఆ జరిమానా సొమ్ముతో ఆ రోజు గూడెం పెద్దలు మందేసుకుని మజా ఛేసుకుంటారు.

ఇది సంచారజాతి. అందుకని వాళ్ళ సామాన్లు మొయ్యడానికి గాడిదల్నీ, తినడానికి పందుల్నీ పెంచుతారు. త్రాగడానికి మంచినీళ్ళు సొరకాయగుల్లలో పట్టుకుని కూడా తీసుకుపొతుంటారు. (అవి మోసుకెళ్ళడానికి తేలిగ్గాఉంటాయి గనుక.) వీరిది దివామైధునం - వీరిదృష్టిలో రాత్రి మైధునం శవసంభోగం వీరి దేవత కొండమ్మ. నాలుగుపుల్లలు నిలబెట్టి క్రింద కొండదేవతను నిలిపి జాతర చేస్తరు. ఆ జతరలో ఆడామగా నృత్యంచేస్తూ పాడే పాటలలొ 'రేలా,రేలా ' అనే మాట ప్రముఖంగా చోటు చేసుకుంటుంది.

                      నృ త్యా లు


వీరు చేసే నృత్యాలకు సహకారుల డప్పు, డోలు, ఫ్లూటు వాయిద్యాలు. తలపై కొందరు కొమ్ములు కట్టుకుంటారు - అది జంతువు వేషమన్నమాట. జంతువు ఎలా వేటాడుతుందో వీరి నాట్యంలో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అలాగే వీళ్లు జంతువుల్ని వేటాడే విధంకూడాకనిపిస్తుంది. మగగాళ్లు డోళ్ళువాయిస్తుంటే ఆడవాళ్ళు చెయ్యీచెయ్యీ పట్టుకుని వలయంగా త్రిరుగుతూ లయానుగుణంగా నాట్యం చేస్తుంటారు. వీరి సహజ దుస్తులతో చేసే యీనాట్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.