ఈ పుటను అచ్చుదిద్దలేదు
వీరు పశ్చిమగొదావరి గొల్లమందల, చింతలపూడి వగైరా ప్రదేశాలలొ ఎక్కువగా కనిపిస్తుంటారు. వీరినే సుగాలీలంటారు.స్వాతంత్రం వచ్చాక వీరిలో కూడా చైతన్యం వస్తొంది.కొద్ది కొద్దిగా నాగరిక ప్రపంచంలో ప్రవేసశించి నాగరికుల పద్దతుల లోనికి మారుతున్నారు.ఇప్పుడిప్పుడే కొంతమంది విద్యాధికులై ప్రభుత్వంలొ ఉద్యోగాలు,పదవులూ చేబడుతూ ముందుకొస్తున్నారు. ఇది దేశానికి శుభ పరిణామం.
కో య లు గిరిజన జానపదులో కోయలు కూడా ముఖ్యులు. వీరిలో అనేక తెగలున్నాయి. 'డోలీలు ' ఒక తెగ. వీరు నృత్యాలకు డోలువాయిస్తారు. కొమ్ములవారు మరొకతెగ. వారు కొమ్ము ఊదుతారు- ఇలా చేసే పనినిబట్టి వీరి శాఖలేర్పడాయి. ఆదిలో కులాలు కూడాయిలా ఏర్పడ్డవేగా !
భూమి పండుగ వీరికి భుమిపండుగ ప్రధానమైనది. ఈ పందుగ కాలంలో కోయమహిళలు పాటలుపాడుతూ ప్రయాణీకుల్ని ఆపుచేసి మరీ కానుకలు తీసుకుంటారు. సరిగా చెప్పాలంటే మీదబడి జేబులో చెయ్యిబెట్టి తీసేసుకుంటారు. వీళ్ళు అలామీద పడడం వీళ్ళకి సరదా - వీరుపాడే ప్రతి పాటలోనూ 'రేలా, రేలా ' అనేపదం ఉంటుంది. ఈరేలా పదానికి అర్ధమేమిటని ఒక కోయపడుచునడిగితే ముసిముసిగా నవ్వి ఓకధ చెప్పింది. భారతకాలంలో భీముడు గిరిజనకన్య హిడింబితో అడవుల్లో ప్రేమాయణం సాగించినప్పుడు వాళ్ళిద్దరూ వెదురు పొదలమాటున, రెల్లుదుబ్బులు చాటునచేస్తున్న రతిక్రియచూసి కైపెక్కిన సాటి గిరిజన కన్యలుతాపంతో 'రేలా, రేలా ' అని పాడేరట. అనాటినుంచీ వారు యితరులతొ శృంగారపరిహాస మాడదలుచుకున్నప్పుడు ఇలా 'రేలా, రేలా ' అంటూ పాటలు పాడతారట - ఇంతకీ 'రేలా,రేలా 'అంటే వాళ్ళభాషలో రతికార్యక్రమం తాలూకు కవ్వింపు బూతుమాట. ఇది యీజాతికి ఆనందం - అయినాసెక్సు విషయం ఏజాతికానందంకాదు!