పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుంటారు. కాని 3 తరాల వరకూ వారిని తమ జాతిలో కలుపుకోరట. మరి అప్పటి వరకూ వాళ్ల ఫేళ్లిళ్లు అవరితో జరుపుతారు అంటే అలాగే పెంచబడిన పిల్లల్ని వెతికి చేస్తారట. ఆ మూడోతరం పిల్లల్ని కంచుకంచంలో నెయ్యి, పరమాన్నం కలిపి తండానాయకులు తిని ఆ ఎంగిలిని ఆపిల్లల చేత తినిపించి జాతిలో కలుపుకుంటారట. వివాహ భోజనాలలో వీరికి వేట మాంసం (మేకమాంసం) ముఖ్యం. దానిలోనికి మంచి నీరు మద్యం.

రంగ స్థలం మీద ఈ నాటి జానపద నృత్యాలలో లంబాడీ డాన్సుకు మంచి ప్రసిద్ది వుంది. (కాకపోతే కొందరు లంబాడీ డాన్సు అని కోయడాన్సు వేస్తున్నారనుకోండి అవగాహన లేక) తండాలో మగవాళ్ళు డప్పులు వాయిస్తుంటే ఆడవాళ్లు కాళ్లకు గజ్జలు కట్టుకొని జట్టులు జట్టులుగా లయాను గుణంగా రమ్యంగా నృత్యమ్న్ చేస్తారు. ఇది చూడడానికి చాలా ముచ్చటగా వుంటుంది. ఈ నృత్యానికి కూడా ఒక పద్దతి వుంది. ఇది వాళ్ళ సంప్రదాయ పద్దతి. పెద్దవాళ్ళు చిన్నవాళ్లకి నేర్పుతారు. ప్రత్యేకంగా పండుగనాడు "చారెబెజారతే హోలీ ఆయా" అని పాడుతూ ఆనందోత్సాహంతొ వీరు చేసే యీ నృత్యం చూసి తీరవలసిందే. మందు హుషారులో మగవాళ్ళూ, స్వేచ్చగా పురి విప్పిన నెమళ్ళలా ఆడవాళ్ళూ తారస్థాయితో యీప్రదర్శన చేస్తున్నప్పుడు చూసే వాళ్ళ మెను పులకరించి పోతుంది. అలాగే దీపావళి రోజున వీరి దివిటీల ప్రదర్శన కూడా మనోహరదృశ్యం.

పగటి వెషగాళ్ళు వీరి వేషాలువేసి జనాన్ని బలే ఆకట్టుకుంటారు. అంటే వీళ్ళ వేషంలో, భాషలో అంత విలక్షణత ఉందన్నమాట.

వీరి ఇలవేల్పు "తులజాయాడి", పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసేటప్పుడు యీమెకు జోడు మేకపొతులు బలియిచ్చి సారాతో జాతర చేసుకు తింటారు. ఇతర గిరిజనుల లాగే మారెమ్మ, గంగమ్మ, దుర్గమ్మ, దారాలమ్మ వగైరా కొండదేవతలను జంతు బలులతో ఆరాధిస్తారు. అలాగని సాత్వికారాధన లేదనుకోరాదు- బాలాజీ (వెంకటేశ్వరస్వామి) మీద వీరికి మక్కువ ఎక్కువ. అలాగే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కోటప్పకొంద తిరునాళ్ళకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు.