పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ మధ్య వీరి 'ధింసా' నృత్యం దేశ వ్రఖ్యాతి పొందింది. ఇందు ఆడా మగా ఒకరినడుములొకరు పట్టుకుని వలయంగా నిలుచుని లయతో అడుగులు వేస్తూ ముందుకి వెనక్కి నదుస్తూ జట్టులు జట్టులుగా విడుతూ రకరకాల విన్యాసాలతొ నృత్యాభినయం చేస్తుంటీ మొన్న ఢిల్లీయే దిమ్మెరి పొయిందట రిపబ్లిక్ దినోత్సవాలలో.ఇంతకి వీరిది ఒక కళగా గుర్తించి గౌరవించడం ఆనందింపదగిన విషయం.మారుతున్న ప్రపంచంలో వీరుకూడా మారుతూ నేడు విధ్యాధికులై ఉన్నతోద్యోగాలలోకి వస్తున్నారు. ఉన్నత పదవుల నధిష్టీస్తున్నారు.ఇది దేశప్రగతికి చిహ్నం.

కోయలు పశ్చిమగోదావరిజిల్లాలో పోలవరం, బుట్టాయగూడం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మండలాలలో విశేషంగా ఉన్నారు.




                           *****