పుట:Garimellavyasalu019809mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొట్టమొదటి ప్రొద్బలము వారి ఆత్మల నుండియే వచ్చుచున్నదనుటకు సందేహము లేదు.

ప్రబోధం కలుగ జేయవలిననే ఆసక్తి
  అయినను రెండవ ప్రోద్భలమును కూడా మనము ఈసడించ వీలులేదు. ఇదియే పాఠకుల నుత్తేజింప ఛెయవలెనను ఆసక్తి ఆత్మ ప్రోద్భలము వలన లేఖకునకు సగము తృప్తియే తీరును. రెండవ దాని మూలముగానే పూర్తిగా తృప్తికలిగి జన్మ సార్ధక జ్ఞానముదయించును. తన దేశస్థసోదరులు చదివి ఆనందించవలె నని తనదేశము పురోభివృద్ధికి వావలెనని, భారతదేశము ప్రపంచ దేశముల నెల్ల కిరీట తుల్య్హము కావలనని ఆందోళనపడకుండా వ్రాసే లేఖకుదు ముఖ్యముగా ఈ యుగములో భారతదేశమందు లేడనియే  చెప్పవచ్చును రెండు పంక్తులలో వేయిగ్రంధములో వ్రాసినంత మత్రముననే కృతకృత్యుడైనట్లు భావించుకొనేంట పిచ్చివాడు యీ యుగములో లేడు. వ్రాసేదాకానే మొదటి ప్రోద్బలము తొందతపెట్టుచుండును. కాని వ్రాసినది ప్రజలల్లరును చదివి రెండవ ప్రోద్బలము లేఖకులను అల్లరి పెట్టుచునే యుండును. అప్పిటి కాని వారికి సంపూర్ణ పరితృప్తి చేకూరదు.
లేఖకుల పట్ల విరాదరణ
  అయితే ప్రజల హృదయమునకే విజ్ఞానము నెక్కించి వారి నుత్తేజింపచేసి, దేసమును నూతన ప్రభావసమానముగా చేయదనునేది, కలము, కాగితము పట్టి వ్రాసుకునేటంత సులభమైన పనికాదు. ప్రస్తుతం మన దేశములో ఎందరోకవులు, లేఖకులు, వ్ర్రయుచున్నపాటలు, వ్యాసములు, తయారుచేసిన గ్రంధములు, వారి వ్రాతప్రతులను దాటి వెలుపలకు రానేరకున్నవి. అధవా, అచ్చయిన గ్రంధములుకూడా, తమ స్వంత బీరువాలను దాతి వెలుపలకు కదలక వారి ననేక కష్తముల పాలొనరించుచున్నవి.
  ఇంటింటికి, సభకు వెళ్ళి చదివి వినుపించుకునె వారికి ఆ మాత్రముగా నైనను ప్రకతించుకొనే యదృష్టము పట్టుచున్నది. కాని వారు