పుట:Garimellavyasalu019809mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రపంచమంతా అక్షరాలు - అంకెలే

(25-1938 న కేశవరంలో ప్రోగ్రెసివ్ రైటర్ల మహాసభ - ఆంధ్ర రచయితల సభాధ్యక్షులు - గరిమెళ్ళ సత్యనరాయణ ప్రసంగం)

లేఖకులంతా ఒకే కుటుంబము వారు
    లేఖకులందరూ ఒకేకుటుంబమునకును, సోదరవర్గమునకును చెందిన వారనుటలో నాకెట్టి సందేహమును లేదు. కొందరు పురాణములు వ్రాసినా, కొందరు ప్రబంధములు వ్రాసినా, కొంద్రు నవలలు వ్రాసినా, కొందరు నాటకములు వ్రాసినా, కొందరు దేశచరిత్రలు, భూగోళశాస్త్రము, విజ్ఞానవిషయములు, రాజేకీయోప న్యాసములు వ్రాసిన కొంద్రు వ్యాకరణ, సాహిత్యశాసన, వైజ్ఞానిక పరి శోధనలు చేసినా వీరందరి ఆశయమును నొక్కటే. లేఖకునికి కలిగే రెండు శక్తులు ప్రోద్భలము చేయుచుండుట వలననె వారు లేఖనమునకు నడంగుదురు. వీనిలో మొదటి ఆత్మతృప్తిరెండవది పాఠకుల నుత్తేజింపజెయవలెనను ఆసక్తి ఈ రెండు సంకల్పములలో నేదియు నేదియు లేని వ్రాతలు వ్రాతలే కావు. అవి కేవలము అక్ద్షరముల ప్రోవులు.
  లేఖకులకు ఆత్మతృప్తియే ప్రధానం
     వీనిలో మొదటిదే లేఖకునకు ప్రదాన ప్రోద్బలము మేఘములు వర్షఋతువులలో వర్షము కురువకుండా యెట్లూరు కొనజాలవో, నాటబదిన బలిష్ట బీజములు ఫల వృక్షములు కాకుండా యెట్లు తప్పించుకొనజాలవో, భానుడు ఉష్ణమును, శశి శైత్యమును, మారుతము హాయిని యెట్లు ప్రసరించకుండా ఉండ జాలవో, ఉత్కృష్టభావస్థగ్తులైన లేఖకులు తమ భావమ్లను చాటకుండా ఊరుకొనజాలరు. దుర్విమర్శనలు వారికి జంకునుజ్ కలిగించవు. సుష్టశాసనములు వారి కలములను విడువజాలవు. వినువారును, చదువువారును ఉండరన్న చింత వారిని నిరోధింప జాలదు. ప్రకటనముకాదన్నభాధకూడా వారిని బాధింపనొల్లదు. వారి ఆత్మగత భావాలను  వారు  గ్రంధరూపేణా కాపాడుకొనుచునే ఉందురు. మనం వినకపోతే వారి ఆదేశమేమైనా అరికట్టబడుతుందా! లేఖకులకు కలిగే
గరిమెళ్ళ వ్యాసాలు