పుట:Garimellavyasalu019809mbp.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాండిత్యము, బిరుదుల కంటె ప్రభుత్వము వారిచ్చు బియ్యే, ఎమ్మే, టైటిల్సు మీద వ్యామోహము హెచ్చినది. ఆంధ్రభాషోపన్యాస దోరణి యందు కంటె ఆంగ్లేయ భాషా వాచాలత్వమునందు చపలత హెచ్చినది. గ్రామమ్లలోని పెద్ద మనుషులు తీర్పుల యందు కంటె జిల్లాకోర్ఘు హైకోర్డుల తీర్పుల కెగబ్రాకు ఆసక్తి పెరిగినది. స్వదేశీ వస్త్రములు, బొమ్మలు, కత్తులు, ఆయుధములు, వస్తువుల కంటె విదేశీ వానిపై కులుకు వర్ధిల్లినది. ఆంధ్రభాషయందును, ఆంధ్రాచారముల యందును గల ఆసక్తి యొక మోస్తరు చాదస్తము క్రింద భావించ బదినది. వాని యందింకను దీక్షగల వారికి శ్రీమంతులిచ్చు పారితోషికములు దానములుగా బావించబడుట వలన, వానిని స్వీకరించువారి ఆత్మగౌరవము క్రుంగిపోయినది. ఆంధ్రభాషామతల్లికి దుర్దినములివి. పిల్లల పాఠ్యపుస్తకములు మినహాగా మరియెట్టి యుద్గ్రందములును ఈ కాలమున పొడమలేదు. అవితప్ప యితర గ్రంధములు చెల్లలేదు. విద్యాశాఖవారి పోషణము తప్ప సాహిత్యలేకాభివృద్దికి వేరు మార్గము లేదాయను. క్రమక్రమముగా కవి సంతానము లడుగండినవి. ప్రతివానికిని ద్రవ్యాపేక్షయు, ఉదొయ్గపరవశత్వమును నిత్యవిధులైనవి. దీమంతులకు కొందరికి ఆంధ్రవిజ్ఞానాభిలాష యుండినను అది కేవలము భెషజమాత్రమై యుండెను. స్వజాతీయ చైతన్య్హము నశించిన జాతికి ఇట్తి దుర్గతి పట్టుట ఆశ్చర్యము కాదు.

   ఈ విధముగా 1907 వ సంవత్సరమువరకు వచ్చితిమి. బంగాళావిభజనము ధర్మమార్గంలో ఒక వినూతన జాతీయ చైతన్యము అసేతుశీతాచల పర్యంతమును చెలరేగినది. భారత జాతి జాతులన్నిటికి వలెనే ఆంధ్రులకును మెలుకువ కలిగి ఉదాసీనత వీడినది. ఆంధ్రభాషయందు, ఆంధ్రజాతీయత యందును, ఒక భక్తి ఉదయించినది.  దీనితో ప్రాచీన విజ్ఞాన పరిశోధనము, చరిత్ర స్మరనము, ప్రబంధపఠనము తలయెత్తినవి. విద్యాధికులు అందునను విద్యార్ధులకళాశాలలో నేర్చుకొనుచుండు విషయములతో తృప్తిపడి యూరకుండక తీరిక యైనప్పుడెల్లా ఆంధ్ర గ్రంధ పఠనము నవలంబించి అందలి సారస్వమును గ్రహింపజొచ్చిరి. తాము పరిశీలించుచుండిన ఆంగ్ల కవుల విశిష్టమహత్త్యమును గుర్తించి తమ భాషలో అట్టి మార్పులను తెచ్చుటకై కంకణ్ము కట్టుకొనిరి. ఆంగ్లసాహిత్య చరిత్రము వలె ఆంధ్రసాహిత్య చరితమును యే యే కారణముల నెట్టి యెట్టి పరిణామములకు పారమైనదో యూహించి వ్రాయజొచ్చిరి. కోటిప్రబంధములున్నను అందులోని
 గరిమెళ్ళ వ్యాసాలు