పుట:Garimellavyasalu019809mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విషయమును విమర్శించి రసమును వెలిబుచ్చి విమర్శకులు లేకుండుటే ఆంధ్రబాషానీరసత్వమునకు కారణమని ఊహించి విమర్శక గ్రంధములను వ్రాయజొచ్చిరి.

  పాఠశాలలో ఆంగ్లభాషఖూఫట్టముకట్టబడినదనిన్నీ, ఆంధ్రభాషతోడపెళ్ళికూతురివలె కూర్చున్నదనిన్నీ, అందులో నేర్పంబడు విషయములు యేదో వెట్టికై మాత్రమే చెప్పబడుచున్నవ నిన్నీ దేశస్థులు గ్రహించినారు. ఆంధ్రభాషకధిక ప్రాముఖ్య మీయవలెననిన్నీ, ఆంధ్రరాష్ట్రమేర్పడాలెననిన్నీ మొట్టమొదట ఆంధ్రదేశమునందు జాతీయాందోళనము ప్రభవించినది. పాఠశాలలోని గద్యపాఠ్యగ్రంధముల భాష సనాతన గద్య గ్రంధభాష కాదనిన్నీ, గద్యభాషలో అనెక వ్యావహారిక పదాలొ గ్రంధాలు చదువ వలెనన్నా వ్రాయవలెనన్నా వాడుక భాషపై పూర్వకాలంలో ఇప్పుడున్నంతవెగటూ,  ఏవగింపూ లేక అటువంతి ప్రయొగాలు కవులు తమ పద్యకావ్యాలలో కూడా ధారాళంగా వాడుతూ నిజమైన వాడుక భాష కుండే సౌందర్యం రాదనిన్నీ, శ్రిగిడుగు రామ మూర్తి పంతులుగారు, వగైరాలు తమ పరిశోధనలు ఉదాహరణ రూపకంగా అఖండమైన ప్రచారం చేశారు. చెళ్ల పిళ్ల వెంకట కవీశ్వరుని వంటి శతాఫదాన్లుకూడా ఈ వాదన నంగీకరించి ఈ భాషలో నేడు ధారాళంగా గద్యం వ్రాసేస్తున్నారు. ఆ గద్యం గ్రాంధిక భాషకంటే వేయిరెట్లు అందంగా వుందని కూడా మనము అంగీకరించక గప్పకుండావుంది. వాడుక భాషమీద నిరసన దండయాత్ర చేయడం ఇప్పుడు అవివేకం, వ్యర్ధం కూదాను అయినా బ్రిటిషు పాఠశాలలు స్థాపించబడినప్పటినుంచీ ఈ కృతభాషలో వ్రాయడం మన కఃభ్యాసమయ్యేవుంది. 'వచ్చింది ' అనేదానికి బదులు 'వచ్చినది ' అనో ఐతే అనుటకుబదులు అయినను అనో, వచ్చాను అనే దనికి బదులు వచ్చితిమి అనో పూర్వపదం పడుతూనే వుంటుంది. కృతక భాషే అనండ్శి మరే భాషోఅనంది ఆ భాషలో ఉండే ప్రయోగాలన్నిటిను బహిష్కరిస్తూ గ్రంధాలు వ్రాయగల గడుసరి నేటివరకు యేవరూ పుట్టలేదు. బహుశా ఒక్క రామమూర్తి పంతులుగారు వారి వంటి ఒకరిద్దరు మినహాగా
గరిమెళ్ళ వ్యాసాలు