పుట:Garimellavyasalu019809mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుటుంబమువాడనని చెప్పుకొనుటకు గర్వముగా వుండెను. ప్రతి కవియు తన తాత ముత్తాతలెటువంటి కవులో యే యే గ్రంధములు వ్రాసిరో గ్రంధాదిని యేకరువు పెట్టుకొనుట సంప్రదాయమైనది. జన సామాన్యములో కవి జనదరణము హెచ్చిపోయెను. ఎవరికి విద్యయున్నను ఏ విధ్య లేకున్నను నోటిలో నాలుగు మాటలుండి పద్యములల్లగల శక్తి యుంటే చాలును. దేశాటనము గౌరవముగాచేయగల అధారము లభించుచుండేడిది ప్రతి మహాకవియు అనేకిఅ సాధారణ లేఖలును నిత్యవ్యవహారములును కూడా కవిత్వభాషలో జరుపుకొనుట యొక విశేషముగ నెంచబడెను. ఇవి నిజముగా ఆంధ్రభాషామతల్లికి అధిక సౌభాగ్యదినములు దేశములో యెన్ని యుద్ధములు వచ్చి యెందరు ప్రాతరాజులు కూలి క్రొత్త సంస్థానములు క్రొత్త గద్దెలు యేర్పడుచున్నను, కవితా పోషణము కవితా ప్రసంగములును యధారీతిని సాగుచునే యుండెను. క్షత్రియులు, రెడ్లు, వెలమలు, సమస్త పౌరుష్ జాతులును కవిపోషణము నేమరకనే యుండిరి కనుక విజ్ఞానము వేయిచేతుల రేడు వలె దేశము నంతటిని వెలిగించుచునే యుండెను.

      ఈ ప్రబంద భాష యెంత విజృంభించి కూడా, కవిత్రయము భాషను వెనుకకు త్రోయలేదు.  నేటికిని ఈ ప్రబంధము లెంత సుగ్రాహ్యము లై యున్నవో తిక్కనాదుల భాష కూడా అంత సుగ్రాహ్యమై యున్నదన్న ఆంధ్రభాష యొక మోస్తరుగా స్థిర స్వరూపమును వహించియున్నదని చెప్పుట్ కాటంకమెమి కలదు? అయినను స్థిరత్వమునే ఒక మోస్తరు దేవతగా భావించి పూజింపమొదలు పెట్టినచో అనుకరనము ప్రబలి అసలు చైతన్య మంతరించక మానదు. పిద్ప కాలపు ప్రబంధముల కిట్టి దోషమే కొంతవరకు పట్టిపోయినది.  ఈ స్థితికి ఆ కాలపు కవుల స్థిరత్వారాధన మొక్కటియే కారణము కాదు. ఆంధ్రజాతీయ చైతన్యమే మందగించిన రోజులవి. ఆంధ్రుల శిల్ప నైపుణ్యము , క్షాత్రప్రజ్ఞ వైదిక దీక్ష, ప్రాచీన గౌరవ సంప్రదాయ పరిరక్షణము మొదలగు సుగుణములెల్లయు నసివాళ్లు వాడినవి  అంతకౌ ముందుండిన దేశీయ - అల్లకల్లోలములడుగంటి బ్రిటిషు ప్రభుత్వము వారి వర్తక వాణిజ్యముల కనుకూలమైన శాంతి వాతావరణమేర్పడినది. దేశస్థులందరి ప్రజ్ఞలును ఆ ప్రభుత్వనీతిని పోషించుదెననే వ్యాపింపజొచ్చినవి. ఆంధ్ర సంస్కృత భాషలలో
గరిమెళ్ళ వ్యాసాలు