పుట:Garimellavyasalu019809mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రబంధములలో తరచుగ గాననట్టియు సమాన గుణములు కురిపించి విడిచి ఆయా పేరులు గల గ్రామములకు, నగరములకు, పట్టణములకు ప్రత్యేకించి ఎల్లునట్టియు, కదనము యెక్క గమనికను, వీలయినంత వరకు ప్రతియక్షరమును సంబందించు నట్టియు విశేషములు చేర్చవలెను. ఇట్లు చేయుట వలన ఇతివృత్తము సరిగా నడౌచున్నట్లు మనదృష్ఠికి గొచరించుచుండును.

     పిమ్మట ఈ దేశములో నున్న కులాచార వ్యవహారములను చిత్రించుచు రావలెను. కాని పల్లె పడుచులకు పట్టణ వాసపు ఫేసు ఫౌడరులను పూసియు, పట్టణపు కన్యలకు టర్కీ మసుగులు ఇంగ్లీషు గౌనులు తొడిగియు, వికారవేషములు వేయరదు. ఆచారములను మీరి ప్రవర్తించు వారి విషయమై వర్ణీంచునపుడు మాత్రమే అట్టుల వ్రాయనగును. ఇది కాక ప్రతి జారికిని జాతి లక్షణముల నొప్పు కొన్ని స్వభావ లక్షణములుండును. ఇవి దేశమునుండి దేశమునకు, రాష్ట్రమునుండి రాష్ట్రమునకు మాత్రమే కాక ఒక గ్రామము లేక నగరములొ కూడా ఒక తెగనుండి మరియొక తెగకూడ భేదముగా నుండును.  వారి యిళ్ళు వాకిళ్ళలోనూ వారి వస్తు వాహనముల నుంచుమొనెడి యిమ్ములోను ఒకరినొకదు పలుకరించి ఆదరించెడి విధానములోను, ఇతరులతో ప్రవర్తించునప్పుడు కనబడుచు విధి విషయములు లేక టెక్కు టక్కులలో శుబాశుబ పుణ్యాపుణ్య కార్యములలోను, ద్రవ్యాదుల నాకర్షించునట్టి లేక వెచ్చించునట్టి తెరవులలోను, సరసములు, సల్లాపములలోను ఈ లక్షణములు తమ్ము తమ్ము చూడు మన్నట్లగుపింఛుచుండును. నిజమైన శిల్పదృష్టి గల కవి వాటినెట్లో పోల్సి వర్ణనలో, ప్రశంసలలో, సంభాషనలలో వాటి చాయల నాకర్షించి ముద్రించగలడు. ఈ శిల్పదృష్టి లెని వాడేంత పండితుడయ్యు, ఎట్టి యనర్గళ ధార కలవాడయ్యు ఆ సంఘచ్చాయ నాకర్షించలేదు.
   ఈశిల్ప దృష్టి స్వతస్సిద్ధముగా పుట్టుకొని రావలసినదే యని యెప్పుకొనుచునే అట్టి శిక్పుల కుండవలసిన కొన్ని సాధారణ లక్షణములు మాత్రమిచ్చట్ చెప్పవలసి యున్నది. వారు సంఘ మునెడ యెడము గాక సంఘములో కలిసిమెలసి తిరుగ నభిలాష కలిగి తిరుగుచుందురు. వారి