నక్కరలేదు. నిజముగా జరుగుచున్నట్లనిపించిన జాలును.
సాంఘిక నవల కవి వ్రాయుచున్న నాటి కాలముదై యుండవలెను. మన కథ జరుగుచున్న నాటి సమయమున ప్రయోగమందెచ్చటను కానరాదు. కథ యే భాషలో వ్రాయబడుచున్నదో ఆ భాష మాటలాడే ప్రాంతమునకును, జాతికినీ సంబంధించినదై యుండవలెను. ఒక దేశపు ప్రజలు వేఱొక దేశపు భాషను దానికి స్వతస్సిద్ధమగు జాతీయములతోను, సులువుతోను, సౌందర్యముతోను మాటలాడజాలరు. కవి తన స్వభాషలో స్వభాష మాటలాడు వారి జీవనమును ప్రతిబింబింప చేయుటకు ప్రయత్నించిననే సాంఘిక నవల సరియైన చిత్రము కాగలదుకాని లేనియెడల సరియైనది కాజాలదు.
కథ సత్యముగ జరుగుచున్నట్లగుపించి వలెననిన సాంఘిక నవల కవి కాలము నాటిదై కవి యొక్క స్వభాషలో రచితమై పాత్రలు తమ మాతృభాషను నవలలో మాటలాడుచుండ వలెనని కథలో నెచ్చటను కృత్రిమ నామాదులుండరాదు. కృత్రిమ నామములనగా ఆ భాష మాటాలాడే ప్రజలు గల రాష్ట్రములో వాడుకలో లేని స్థలనామములు, పురనామములు, పురుషనామములు మొదలగునవి. భోగవతి, మధురానగరము, ధార్మిక పురము, శ్రీ నికేతనము మొదలగు పుర నామములు, రజతగిరి, కనకాచలము మొదలగు కొండల పేరులు, మందాకిని, మత్స్యవతి మొదలగు నేఱులపేరులు, వీరసేనుడు, విజయసింహుడు మొదలగు పురుష నామములు, సంధ్యావళి, మదాలస, మనోరమ, మొదలదు స్త్రీ నామములు - ఇట్టివి మన తెలుగు దేశములో లేవు. కనుక ఇట్టి పేరులను కవి సాంఘిక నవల యందు ప్రయోగించినచో అంతవరకు అవి కాల్పనికములుగా తోచి కథనంత వరకు సత్యము కానట్లు తోపజేయును. ఆంధ్రదేశపు సాంఘిక నవలను వ్రాయగడగినచో ఆంధ్రదేశములో నున్న నదులు, కొండలు, గ్రామములు, పట్టణముల పేరులును, ఆంధ్రదేశములో వ్యవహారములో నున్న స్త్రీ, పురుష నామములను మాత్రమే ప్రయోగించవలెను.
ఇంతియ కాదు. ఈ నదులను గ్రామములను మొ॥ వానిని గూర్చి వర్ణించునపుడు గాని, వాటి ప్రశంసలు వచ్చునప్పుడు గాని యే నదులకైనను గ్రామములకైనను సమానముగా వర్తించునట్టియు పురాణ
గరిమెళ్ళ వ్యాసాలు
63