పుట:Garimellavyasalu019809mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కష్టములను, సుఖములను, సరసములను, విరసములను తాము కూడ ననుభవించునట్లు మనశ్చలనములను గలిగి యుందురు. అందరితోను కలుపుగోలుతనముతో తిరుగగలట్టియు, అరమర అభ్యంతరము లేక ప్రవర్తించునట్టియు, అందరికిని హర్షప్రదమై నట్టియు, జనపరిచయము, సంభాషణతీరు, హస్యరసము, అనుకూలమగు నడవడి కలిగియుందురు. సాంఘిక నవల వ్రాయగొరువారు మున్ముందెంత వరకీ లక్షణములు తమకు గలవో యేచించుకొని, అలవాటు చేసుకొని, చాయగ్రఃఅన శక్తి నలవరచు కొని గ్రంధరచనకు గడంగినచొ బాగుండును. లేనియెడల ఆ గ్రంధము సరియగు చిత్రముగా ప్రచారము కాక గ్రాంధిక శైలి కొరకో, అద్భుతములగు చర్యలకొర్కో దీర్ఘమగు కధ కొరకో, నీతిబోధ కొరకో పాఠశాల తరగతులలో పఠనీయమైనదిగా కమిటి వారిచే నిర్ణయింపబడుట కొరకో మాత్రమే గౌరవము కలిగియుండును.

  కవికీ దృష్టి యుండి, స్వభాషణలో రచించుటకు, స్వభాష మాటలాడువారి చర్యలే వ్రాయుటకు, వారి ఆచార వ్యవహారములను, ఆశలు, విలాసములను, కష్ట సుఖములనే చిత్రించుటకు గడగినచో సాంఘిక నవల రచించు నాతడింకొక విషయమును గురించి అత్యంత శ్రధ్ధ వహించవలసి యున్నది అది శైలిని గూర్చి ఈ సందర్భమున గ్రాంధిక, వ్యవహారిక శైలులను గూర్చిన చర్యకు దిగుటకు నాకెంత మాత్రము నిష్టములేదు. సాంఘిక నవలను గూర్చి ఆలోచించినంత వరకైనను, ఒకశైలి వ్యావహరికమైనంత మాత్రమున గ్రంధస్థమగుటకు తగదినియు గ్రాంధిక మైనంత మాత్రమున సంఘమును చిత్రింపజాలదనియు చెప్పుటకు నేను సాహసింపను. శైలి కవికి నైజమై యుండవలెను. కాని శ్రమపడి పుస్తకములు వెదకి కష్టమై అపురూపమైన ప్రయోగముల నేర్చి గ్రంధములో గాంభీర్యము కొరకు జొనుపబడినదిగా నుండకూడదు. సముద్రతరంగముల వలె గంభీరమున నుండుగాన, సెలెయేటి కలకలము వలె మంజులముగా నుండును గాన, తేనేసోనల వలె తేటగా నుండును గాన, శైలి కవికి నైజమై యుండవలెను. అతను సృష్టించెడి పాత్ర నోటితో నది ఔచిత్యము గలిగి యుండవలెను. పాత్రల సంభాషణలో నుపయోగించెడి శైలి పాత్రము నుపయేగించినంత వరకు మాటలాడు కొనే భాషలో,
గరిమెళ్ళ వ్యాసాలు