పుట:Garimellavyasalu019809mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాత్రము కాకుండుటలో వింత లేదు. కాని మార్పు కావలెనని తలంచు వారికిని తలంచుట యెరుగకయే చేసి వ్రాయు వారికిని ఇది చాలా వరకు తృప్తికరముగా యున్నదనుటలో ఆటంకము లేదు. "ఉను" అను సముచ్చల్యమును "ఇన" అను చేదర్ధకమును, "ఏడు" అను విశేషణమును లోపించి వాటి ముందటి అక్షరములకు దీర్ఘములు వచ్చే ఉదాహరణములను చూపించి శాసించినారు. ఉదా అంతా, ఇంకా, చల్లాయంబలి, వెన్నా మీగడ, వినీవినని, చూచినా చెప్పినా, వచ్చే, పోయే, మొదలగునవి మఱియు, జనులవాడుకలో ఉండి శిష్టుల గ్రంధములలోకి యెక్కి శృతిరమ్యములై పాటలలోను, పద్యములలోను, శతకముల లోను గుత్తులు గుత్తులుగా కానిపించు, తెలుసుక, పట్టుక, పుచ్చుక, అనేటి, పోయేటి, కలపడము, చెక్కడము, పుచ్చుకోక, తీర్చుకోక, పడ్డ, పడ్డాడు, పోను, కాను, విందాము, చూతాము, రానేవచ్చితిరి, కరక్కాయ, వెలక్కాయ, ఎలుగ్గోడ్దు, బొట్టేట్లు, కద్ధు, పద్దు, చిలక, ఇరవై, అరవై, మొదలగు పదములకును రూపములకును, ప్రయోగములను చూపి అనుశాసనము నిచ్చియున్నారు. రసున్నలు, బండిఱాల విషయమును వ్రాసెడి వారి యధేచ్చకు విడచి పెట్టినారు. దేశ్యవిదేశ్యపదముల నుపయోగించుటలో కూడ మన పూర్వులెట్టి స్వాతంత్ర్యమును జూఱగొనితో మనకును అట్టి స్వాతంత్ర్యమును జాఱ యిచ్చినారు. స్నుశాసనములు లేవు గదా యని సాఅహసౌచార్యములు గల సత్కవీంద్రులును గద్యములో ముద్గ్రంధములను వ్రాయువారును ఇంపితములగు నవ్యప్రయోగములను చేసుకొని పోకమానరు కాని, కాలలక్షణమును భాషాతత్వమును గుర్తెఱిగి వారికందరికిని చేతులు వాచి స్వాతగమొసంగుట ఉదారనీతి గల విద్వాంసులకు సుభూషణము.

 ఇకను, వ్యావహారిక భషను వ్రాయుచున్నా మనుకొనే వారల సంగతి నాలోచింతాము.  వారిలో ననేకులు ఈ ఒరయోగములనె కాక, వాడుకలో నున్న ఇంకా అనేకము వాటిని కూడా ఉపయోగించుచున్నారు. వెళ్ళింది, వచ్చాడు, మనం, ఊహిస్తూ, పోతోంటే, నుంచుని, పడతాయి, పడతిఅ ఇద్దరమూ, మఱిన్ని మొదలైన ప్రయోగాలను చేస్తున్నారు. ఈ ప్రవాహం చూడగా ఎక్కడా ఆగేటట్లు లేదు. శిష్ట ప్రయోగములను కవి ప్రయోగములనూ, విశిష్ట ప్రయోగాలుగా మాత్రమే వుంఛి మన పూర్వులు అనుశాసనం