పుట:Garimellavyasalu019809mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెయ్యకపొవటానికి కారణం. ఒక కొంచెం సందు చెయ్యగానే లక్షోప లక్షలుగా ఇట్టి ప్రయోగాలందులో నుంచి దూరి లోపలకు ప్రవేశిస్తాయని భయమే కాబోలు. ఈ అనుమానంతోటే కాబోలు మన పూర్వపు అనుశాసనకులు ఈ పిశాఛాలు లోపలికి రాకుండా ద్వారాలు మూసేశారు. ఏ నలుగురు కిరీటమాంధాతలో మడిగట్టుకొని జన్మానికల్ల శివరాత్రి లాగ ఏ రెండుమూడు పుస్తకాలో వ్రాస్తే లక్షణ బద్ధములై గిరిదాటకుండా లోలోపుల జిలుగులతోటీ నగిషీలతోటి శ్లేషలతోటి, వ్యంగ్యాలతోటి, బంధాలతోటి శబ్దాలంకారాల తోటి అలరారుతూ వుండేటట్లు, ప్రారంబవిద్యలూ, పరదేశనాగరికత లూ, సామాన్య జన సంపర్కములూ, అతి పాండిత్యములూ, అల్ప పాండిత్యములూ, నిత్యసంభాషణలూ, వ్యవహారములూ, గ్రంధముల లోకి, పత్రికలలోకి సంచికలలోకి, కధలూ, కవిత్వం, విమర్శన, హేళన మొదలైన రూపాలతో ఎక్కుతూ వుండే సమయంలో, తర తరాలతో కూడుకొన్న విద్యగలవాళ్ళు, ఆశేతు శీతాచలం పర్యంతం అక్కడక్కడ చెదరిన్నీ ఒక్కొక్క చోట గుంపులుగా కూడిన్నీ జీవించు తూ వుండే వాళ్లు, మామండలంలోని మంచి భాష, అంటే మా మండలంలోది మంచి విఱ్ఱవీగడం యెఱిగిన వాళ్ళు వ్రాసే భాష సర్వమూ అనుశాసన రక్షితమఉంటుందని భావించడం కూడా వెఱ్ఱే అయినప్పటికీ, ఇవి అన్ని రావలసినదే. వీటిలోది చాలా మట్టుగ కొంతకాలం వరకైనా అనుశాసనములకు తప్పి ఉండవలసినదే. ప్రారంభకులు వాసినప్పుడు వరి వ్రాతలు దిద్దివాటికి మఱి శిష్ట ప్రయోగాలు చూపించి ఈలాగుంటే బాగుంటుందని హెచ్చరించవలనదే, కాని ఇవి అన్నీ అతనికి జ్ఞానం వచ్చి శైలి కుదిరేదాక చేయవలసిన సహాయాలే కాని, తరువాత, అతను గ్రంధకర్త అయిన తరువాత అతను ఒక లక్షణానికి కాని, సలహాకుకాని కట్టుబడి ఉండు ఇంగ్లీషులో "Style is the man" అంటారు. మనిషి యేలాంటి వాడైతే వాడి శైలి వాణ్ణీ అనుకరిస్తూ వుంటుంది.

  ఈలాగున అన్నంత మాత్రమున సూర్యనారాయణీయము వంటి అనుశాసన గ్రంధమొకతి ప్రస్తుత సందర్భములలో అనవసరమని అర్ధము కాదు. అది ఒకవైపున భాషాతత్వజ్ఞానమును సంపాదించుకొనుటకు సాధనమై, ఒకవైపున శాస్త్రిగారి ఉదార పాండిత్య స్తృతికి తార్కాణమై, ఒక వైపున బాలకులకు విద్యార్ధు లకును సుబోధకమై ఒక వైపున ఆంధ్ర గ్రంధకర్తల