ధణధణలును ఆవేశములునే యెంత మాత్రము కాదనియు, వీరి తాలూకు సవిమర్శన ప్రాచీనార్వాచీన ప్రసిద్ధ గ్రంథ పఠనము మాత్రమే యనియు, వీరి యనుశాసనపాఠకు లెల్లరకు విదితము కాగలదు. వీరను శాసించిన శబ్దములును రూపములును అనేకము పూర్వకవిగ్రంథస్థములై యుండుట మనకు గోచరము కాగలదు. అయినను వీరి మార్పులకును శ్రీరామమూర్తి పంతులుగారు కావలెననుచున్న మార్పులకును భేదము, పోవలసిన మేఱలో హెచ్చుతగ్గులు కాని, దిక్కులో భేదమెంత మాత్రమును కాదని సువిదితము. రామమూర్తి పంతులు గారును వీరును కూడ సాంప్రదయ పద్ధతినే అభిలషించుచున్నారు. అతని పద్ధతియూ పరిశ్రమయూ ఆతనిని మరికొంతదూరమెక్కువగా సాహసించి తీసుకొని పోవుచుండగా ఇతని పద్ధతియు పరిశ్రమయు ఇతనిని కొంచెము దూరము మాత్రమే తీసుకొని వచ్చి నిస్సంశయ మైనట్టియు, నిపుణమైనట్టియు, సౌందర్యవంత మైనట్టియు సుప్రసిద్ధ కవీంద్ర గ్రంథ సంస్థిత ప్రయోగములకు మాత్రమే కాక వాటి పొలిమేరలో గూడ క్రీడించుట కుత్సాహమును పురిగొల్పినవి. ఇందుచేతనే వీరు గ్రంథప్రయోగము లేక వాడుకలోనుండు పుచ్చుకు, తీసుకు, కామోసు మొదలగు వాటికనుశాసనమిచ్చియు వాడుకలో ఉండి ప్రయోగ గౌరవము నందిన ఇస్తిని, వచ్చీవా, కూర్చొను మొదలగు మనోహర పదములకును రూపములకును అనుశాసన మీయక తాము "ప్రమాణముగా గొప్ప "ప్రయోగములం వ్యాకరణ" మను నార్యోక్తి నిప్పటికి మీఱిన వాడనైతిని" అనుటయు "మఱియు ననుశాసించిన శబ్దముల నీయనుశాసనమున నిపుడుపయోగింపక భాషా సంప్రదాయ వేత్తల యనుమతికై దృష్టి నిలిపితిని" అనుటయు సంభవించినది.
అయినను, శాస్త్రి గారి వంటి సనాతన గ్రాంథిక శైల్యభిమానులే అతివాదులనబడువారికంటె ముందుగా ముందంజవేసి, భాషాతత్వమునూ, మార్పు లక్షణములనూ తాము గుర్తెఱింగి అనుశాసన రూపకముగా ఒరులకు చాటుట మన ఆంధ్రభాష యొక్క భావ్యభివృద్ది సూచకమని నిజమైన భాషాభిమానులెల్లరి తలపైయున్నది. శాస్త్రి గారు చూపిన ప్రమాణము లెల్లయు లేఖక పాఠక రచయిత ప్రమాదములని తృణీకరించుట వీరగ్రాంథికుల మతమై యున్నది. మార్పేవద్దని కొమ్మమీద కూర్చొను వారికి ఇది ప్రశంసా
50
గరిమెళ్ళ వ్యాసాలు