పుట:Garimellavyasalu019809mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసనమునకు గంటె ఎక్కువ అధికారము కూడ సిద్ధించును. అందుచేత యీ క్రొత్త కర్యమునకు గడంగుట పెద్దల యావశ్య కర్తవ్య మనుటలో ఎట్టి సందియమును లేదు.

   ఇట్టి పండిత పరిషత్తునొకదానిని నేర్పాటు చేసి క్జ్రొత్త సంస్కరణోద్యమములు చేయవలెనని ఉభయ పక్షములల్ని నాయకుల మధ్యను కొన్ని రాయబారములను ఉత్తర ప్రత్త్యుత్తరములును జరిగిన వన్న సంగతి వజ్రాయుధము, సుజనరంజని మొదలగు పత్రికలను పఠించెడి వారికెల్లరకు విదితమే కాని మేఘములు క్రమ్మి ఉరుములు మాత్రమురిమి పటాపంచలైనట్లు వాటిలో నుంచి కొంత శుష్కధ్వని తప్ప ఫల రూపమగు వర్షమేమి కురవకనే పోయినది. వాద ప్రతివాదములు, శుష్క సూచనలూ, వీటితో మనకేమి ప్రయోజనము? ఇది అంతయు వృధాకాలహరణమే అని భయపడి నవీన గ్రంధకర్తలెల్లరును, దేశాభ్యుదయమును, భాషాశ్రేయస్సును ఎట్లు చేకూరునని వారు తలంచుచుండిరో అట్లే గ్రంధముల నప్రతిహతముగా వ్రాయబూనుచున్నారు. సాహితి సఖి, రెడ్డిరాణీ, భారతి, ఆంధ్రభారతి, కవిత, లలిత, కృష్ణ తెలగ, సమదర్శిని మొదలగు వానినెల్ల పఠించు వారికిది గొచరము గాఅ అంత వరకు మనమేల వేచి యుండవలెను! భాషకును దేశమునకును అభ్యుదయ దాయకమైన అనుశాసనము నొకదానిని నేనే ముందుగా చేతును గాక, యని పూనుకొని బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారొక అనుశసనమును వ్రాయుటకు బూనుకొని కొంతవరకు సఫలీకృత మనోరధులైరని చెప్పుట కెంతయు సంతోషముగా నున్నది. 
  శ్రీ శాస్ద్త్రిగారు సుప్రసిద్ధ పండితులు అది మంచియు గ్రాంధిక శైలి యందభీమానులుగా నున్నారు. ఇప్పటికి గూడ అట్లే అయి యున్నారని అతని తలంపు అయిననూ, వీరేశలింగం పంతులుగారు, సీతారామశాస్త్రిగారు, రాయుడు శాస్త్రి గారు చెళ్ళపిళ్ల వారు, కీ.శే. పోలవరం జమీందారు గారు కొవ్వూరు సభ వారు మొదలగు వారెల్ల వారి శుద్ధ శ్రోత్రియాభిప్రాయముల నించుక మార్పుకొన్నట్లే వారు కూడా కొంత వరకు మార్చుకొన్నారు. వీరు మార్చుకొనుటకు కారణము రామమూర్తి పంతులుగారి నుండి ఆందోళకుల