పుట:Garimellavyasalu019809mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కఠినశిక్షవిధించియు చివరి సంవత్సర భాగములో విడిఖైదీని చేసి పుస్తకములను వ్రాతపరికరములను తెప్పించు కొనననిచ్చి నాకీ సనాతన భాషను మాత్రమే కాక మఱికొన్ని భాషలను గూడ నేర్చుకొనగల మహాభాగ్యమును కల్పించినారు. పోలస్యమయ్యరు గారును, ఏ.యన్. కృష్ణస్వామి అయ్యంగారును నాకు తమిళ భాషను నేర్పి వారి యుత్కృష్టగ్రందములను గ్రహించి భాషను గ్రహించి తెలుగులోనికి భాషాంతరీకరణము చేయగల సామర్ద్యము నొసంగినారు. విక్రమదేవవర్మగారు ప్రభల లక్ష్మీనరసింహం గారు మారేపల్లి రామచంద్రమూర్తి గారు రావుబహదూరు తాడేపల్లి వెంకటక్రిష్ణయ్యగారు మొదలగు విద్వత్శిఖాముణులు దీనిని వివి (నాయల్ప పాందిత్యము వలనేమి భాషాంతరీకరణ సందర్బమ్ననేమి యుండకతీరని పెక్కు నలుసులున్న ప్పటికిని) గ్రందముయొక్క మహోత్కృష్టతను గూర్చియు నేను పడియుండిన శ్రమను గూర్చి యుత్సాహ వాక్యములను పలికి అచ్చు వేయించవలసినదేయని యంగీకరించినారు. భొగరాజు పట్టాభిసీతారామయ్య గారు బందరు పెద్దలు కొంద్రకు నన్ను పరిచయము పరచి పోషకులని చేర్పించి యీ భాగమునకు సరిపడు ద్రవ్యమును జతపరచినారు. నడింపల్లి నరసింహారావు గారు మొదలగు నితర్ల సహాయమున కొంతమంది చందదారులు చేరినారు. శీయుత రావూరి శ్రిశైలపతి గారును శ్రీయుత దేసోద్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారును శాశ్వత రాజపోషకులుగ జేరినారు. ఇట్లు నాముఖమును జూచియేమె నా గ్రంధమును ముఖమును జూచియేమి నాకును నా గ్రంధమాలకును నొకేసారిగ అహాయము చేయుచున్నారని చెప్పకతప్పదు. ఇంకను పెక్కుఱు చందాదారులుగను పొషకులుగను చేరనిచో భాషకు దేశామునకును (కాదననేల నాకుజు) నభివృద్దికరమగు ఈయుద్యమము నెరవేరజాలదని ఉదారశీలురును విద్యాభిమానులునగు దేశబక్తులెల్లరును గ్రహించియే యుందురు. ఈ కాలములో అద్రంధరచనము ప్రచురణము, విక్రయము మొదలగునవి యెల్లయు యెంత కష్ట సాధ్యములైనవో ఆంధ్రులెల్లరును గ్రహించవలసియున్నది. నేనింకను భాషయందుగల అభిమానముచే దేవులాడుచు దానికి ద్రోహమొనర్తునేమో యను పాతకమునకు వెఱచి తదేకదీక్షతో దానియందు కొట్టుకొను