కఠినశిక్ష విధించియు చివరి సంవత్సర భాగములో విడిఖైదీని చేసి పుస్తకములను వ్రాతపరికరములను తెప్పించు కొననిచ్చి నాకీ సనాతన భాషను మాత్రమే కాక మఱికొన్ని భాషలను గూడ నేర్చుకొనగల మహాభాగ్యమును కల్పించినారు. హాలస్యమయ్యరు గారును, ఎ. యన్. కృష్ణస్వామి అయ్యంగారును నాకు తమిళ భాషను నేర్పి వారి యుత్కృష్టగ్రంథములను గ్రహించి భాషను గ్రహించి తెలుగులోనికి భాషాంతరీకరణము చేయగల సామర్థ్యము నొసంగినారు. విక్రమదేవవర్మగారు ప్రభల లక్ష్మీనరసింహం పంతులుగారు మారేపల్లి రామచంద్రశాస్త్రకవి గారు రావుబహదూరు తాడేపల్లి వెంకటక్రిష్ణయ్యగారు మొదలగు విద్వత్శిఖాముణులు దీనిని విని (నాయల్ప పాండిత్యము వలననేమి భాషాంతరీకరణ సందర్భముననేమి యుండకతీరని పెక్కు నలుసులున్నప్పటికిని) గ్రంథము యొక్క మహోత్కృష్టతను గూర్చియు నేను పడియుండిన శ్రమను గూర్చియు యుత్సాహ వాక్యములను పలికి అచ్చు వేయించవలసినదేయని యంగీకరించినారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు బందరు పెద్దలు కొందరకు నన్ను పరిచయము పరచి పోషకులను చేర్పించి యీ భాగమునకు సరిపడు ద్రవ్యమును జతపరచినారు. నడింపల్లి నరసింహారావు గారు మొదలగు నితరుల సహాయమున కొంతమంది చందదారులు చేరినారు. శీయుత రావూరి శ్రీశైలపతి గారును శ్రీయుత దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారును శాశ్వత రాజపోషకులుగ జేరినారు. ఇట్లు నాముఖమును జూచియేమి నా గ్రంథమును ముఖమును జూచియేమి నాకును నా గ్రంథమాలకును నొకేసారిగ సహాయము చేయుచున్నారని చెప్పకతప్పదు. ఇంకను పెక్కుఱు చందాదారులుగను పోషకులుగను చేరినచో భాషకును దేశమునకును (కాదననేల నాకును) నభివృద్దికరమగు ఈయుద్యమము నెరవేరజాలదని ఉదారశీలురును విద్యాభిమానులునునగు దేశభక్తులెల్లరును గ్రహించియే యుందురు. ఈ కాలములో సద్గ్రంథరచనము ప్రచురణము, విక్రయము మొదలగునవి యెల్లయు యెంత కష్ట సాధ్యములైనవో ఆంధ్రులెల్లరును గ్రహించవలసియున్నది. నేనింకను భాషయందుగల అభిమానముచే దేవులాడుచు దానికి ద్రోహమొనర్తునేమో యను పాతకమునకు వెఱచి తదేకదీక్షతో దానియందు కొట్టుకొను
40
గరిమెళ్ళ వ్యాసాలు