Jump to content

పుట:Garimellavyasalu019809mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నాను గాని ఇంతకన్న ధనలాభప్రదములగు వ్యవసాయములను ఉద్యోగములను చేయనేరక కాదని విజ్ఞానులు గ్రహించవలెను. "వ్యవసాయము చేసుకొన గూడదా? ఉద్యోగములు స్వీకరింపగూడదా? ఉదారుల ఉదారత నెన్నాళ్ళిట్లు పీడించుచు ఈ సోమరివృత్తికై గడంగెదవు. గాంధిమహాత్ముడు ఒడలు వంచి పనిచేయమన్నాడు? గాని యిట్లు పుస్తకముల పేరిట యాచించు కొనుమన్నాడా? ఈ కాలములో డబ్బు తెమ్మంటే గ్రంథము లెవ్వరికి గావలయు?" నని డెప్పిపాడచెడి మహనీయులకిది సమాధానముగా చెప్పవలసివచ్చినందుకు క్షమింతురుగాక.


"బ్రతుకు వారలు దున్ని బ్రతుకువారలు; పెఱలు
బ్రతుకుదురు వారి నతుకుకొని"


యని మాతిరువల్లువరు నాయనారే యీ గ్రంథము నందు వచించి యున్నారు. నిజముగా నీపుడమిపై బ్రతుకవలసిన యోగ్యరీతిని బ్రతుకువారు వ్యవసాయవృత్తిచే బ్రతుకువారే. తక్కినవారిలో కొందరు వారికి సహాయకరములగు నితర వృత్తులలోను కొందరు వారిని గురించి లాభము గ్రహించెడి యితర వృత్తులలోను కొట్టుకొనుచు వారు పండించిన యన్నముమే తినుచు ప్రత్యక్షముగ గాకున్న పరోక్షముగనైనను వారిపై నాధారముపడి బ్రతుకుచున్నవారే. ఈ కారణము చేతనే ఆ కవీశ్వరుడే.


"ఆణికృషికుడులోక మంతకు అతడే ప్రోవఁ
బూనె పెరవృత్తివారలను"


అనగా "లోకమనెడి రథమునకు అతనే శీలవంటి వాడు. అతను తన్నుఁదాను పోషించుకొనుటయే కాక తన వృత్తికాని పెరవృత్తికిఁ బూనుకొనిన వారినందరిని గూడ బ్రోచుటకు కంకణము కట్టుకొనినాడు." అని వచించినాడు. అట్టి సర్వోత్తమమగు వృత్తికిపోవుటకంటె నాకు శాశ్వతానందదాయకమగు సంగతి వేఱొక్కటిలేదు. అయినను, అట్టి వృత్తిలోనికిఁ బోవుటకు గూడ సర్కారువారి కృపాకటాక్షము వలన సగము వరకు ప్రారంభించిన యీ ధర్మోద్యమమును విసర్జించినచో, నాకు క్షమాపణముండదనే విశ్వాసముతోనే కష్టములకును, నవమాసములకును డెప్పిపోటులకును గూడ వెనుకతగ్గక,

గరిమెళ్ళ వ్యాసాలు

41