పుట:Garimellavyasalu019809mbp.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బఠింపక తీరదు. అట్లు కోరనివారికి కూడ ఇదియొకసారి చదివిన యెడల గాని వినిన యెడల గాని ధర్మము చేయవలెననెడి వేడిని ఉత్సాహమును పుట్టించి కుత్సితములనుండి, బూటకముల నుండి, సందేహములనుండి తోలగించి అకళంకస్వాంతులను జేయును గనుక సకల గృహస్థులకును సన్యాసులకును గూడ ఇది అవశ్వపఠనీయంబని వక్కాణింపక తీరదు. అర్ధ భాగములో రాజులు, మంత్రులు, సైనికులు, సేవలు, వేగులు, స్నేహితులు, బందుగులు మొదలగు రాజ్యాంగ నిర్వహణమునకు బ్రధానులగు జనులెల్లరును గలిగియుండవలసిన లక్షణములు విడువవలసిన గుణములు ఒకరి యెడల నొకరు మెలగవలసిన రీతులు అతి వివేకవంతముగను సారస్య్లముగను వర్ణింపబడుటయే గాక, దేశము, కోట, మొదలగు సంస్ధలెట్లు అమర్ఫబడవలసినదియు గూడ సూచింపబడినది. మరియును సశేషభాగమును రెండవపాయలో రాజ్యాంగ సంబంధములేని యితరులు గూడ తమ తమ స్వంతరాజ్యములగు సంసారములను నిర్వహించు విషయములోనున్ను ద్రవ్యోపార్జవాది యితర విషయములలోనున్ను యెట్టి మెలకువ కలిగి ప్రవర్తించవలసినదియును మిగుల క్రమముగను నింపుగను వర్ణీంపంబడినది.

   ఇక మూడవ భాగమగు కామ భాగమునందా, ప్రియుడును ప్రియురాలును తొలుదొల్త నొకరి నొకరు భోగించుట, నానాటికీ అసౌక్యమునందు మత్తులగుట, గుట్లు బయలుపడనుండుట, లేచిపోవుట, విమర్శించుకొనుట, తిరిగి గృహంబు చేరుకొనుట వివాహబందితులగుట మొదలుగాగల  ద్రవిడ శృంగారరస సంప్రదాయ ప్రకారమగు సంభోగ శృంగార పరిణామ ప్రకరణములును, వివాహానంతరమున నాయకుడు ధర్మార్ధ కామములలో నేదేని యొక దానిని గాని లేదా యొక్కొక్కప్పుడొక్కక్క దానిని గాని సేకరించు నిమిత్తం నాయిక నెడబాసియుయుండునప్పుడు ఒకరి నొకరు విడబాసియెట్లు కాలము గడుపగలిగి రను నంశములును మిగుల శృంగారముగ వర్ణింపబడినవి. ధర్మభాగములో భార్యా భర్తలకు సంబంధించిన ధర్మజీవనమును సాంసారిక జీవనమును నడుపవలసిన విధానమును వర్ణింఛి వారి భొగమునకు సంబంధించిన శృంగార రసము నిందు చిత్రించినాడు.ఈ రెండు భాగములలోను నెచ్చటను గాని సంస్కృత గ్రంధము లనేకములొ వలె