పుట:Garimellavyasalu019809mbp.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున్నుడి

   ఈ గ్రంధములో నేడవకుసుమమును మాచందాదారుల కందరికి నందజేయు చున్నాము.  మా గ్రంధమాలలోని గ్రంధములనెల్ల తలమానిక మనదగినది యీ అర్ధత్రయ సర్వస్వమేయని మా విశ్వాసము. ఈ గ్రంధము అఱవ భాషలో క్రీ.పూ. రెండవ శతాబ్దములో తిరువల్లవరునాయనారు అనుఒక సాలెకులస్థునిచే రచింపబడినది. ఈ గ్రంధమును సదరు కవీంద్రుడు సన్యాసాశ్రమము పుచ్చుకొనిన తరువాత రచించినారట. మానవజన్మమున కవశ్యసాధన నీయములగు చతుర్విధ పురుషార్ధములను గూర్చి శ్రుత్ స్మృతి శాస్త్రము అనుభవము లను నాలుగు విధములగు జ్ఞానములను గల ఆ మహనీయున కెట్టి పరిచయమును అభిప్రాయములును నున్నదియు ఈ గ్రంధము వలన పాఠకులకు విదితము కాగలదు. చతుర్దపురుషార్ధమగు మోక్షమును గూర్చి వివరముగ నతడీ గ్రంధమున చర్చించబడకపోయినను ధర్మ భాగములో రెండవ విభాగమగు సన్యాసాశ్రమమును గూర్చి ప్రవేశించుటలో ఆ సన్యాసికి గల మోక్షపరిజ్ఞానము కూడ మనకు విదితం కాగలదు. మోక్షమును గూర్చి వివరముగ చర్చించబడని కారణము ఈ గ్రంధము యెక్క ఉపోద్ఘాతములొ గాననగును.
       తక్కిన మూడు పురుషార్ధములను గూర్చియు సమగ్రమగు జ్ఞానమును సుందరమగు కవిత్వముతో నింత సూక్ష్మముగ విరచించిన గ్రంధము ప్రపంచములో నింకొకటి లేదని విద్వాంసులనేకులంగీకరించిన విషయము. దర్మమును గృహస్థ భాగము సన్యాసభాగము అను రెండుపాయలుగను అర్ధమును రాజ్యాంగభాగము సామాన్యభాగము అను రెండు పాయలుగను కామమును సంస్కృతములోని సంభోగభాగము విప్రలంబు భాగములకు గ్రమముగ నొప్పిడి చౌర్యభాగము సతీత్వ భాగములను రెండు పాయలుగను విడదీసి యరేదముగ వర్ణించినాడు. నీతి గఱపుటలో మొదటి భాగమును వివేకమును గల్పించుటకు రెందవ భాగమును భోగరుచి చూపించుటకు మూడవ భాగమును అనుపమానములైనవని చెప్పవలెను. ధర్మసిద్ధమగు జీవనమును నడుపగోరు ప్రతిమానవుడును మానవతియు (అట్లు నడుపుటకు గోరనైనగోరని యభాగ్యులను గూర్చి మన మాలోచించవలసిన పనిలేదు) మొదటి భాగమును