పుట:Garimellavyasalu019809mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శృంగారరసమును పచ్చిచేయక బావముయొక్క సూక్ష్మసౌందర్యమును క్రొంగ్రొత్త కధలతో వర్ణింపగలుగుట అతని అసమాన ప్రజ్ఞకు నిదర్శనము.

  తిరువల్లువరునాయనారు జీవచరిత్రమును, వారి గ్రంధమును రచించి తమిళసంఘము లేల తమిళ పరిషత్తు దగ్గర పఠించుటకు పోయిన ప్రకారము, ఆకాశవాణియు తమిళ సంఘమును వారిని సన్మానించిన రీతియు, యుగయుగముల సంఘపండితులును కవీంద్రులును వారిని ప్రశంసించుచు వ్రాసిన పద్యములు మొదలగున వెల్లయును వాటంతట నవియే యొక సంపుటము కాగలవు.  ఈ "తిరుక్కుఱళు" ఆరు సంపుటములును ముద్రించిన తరువాత నేడవ సంపుటముగా దానిని ముద్రించి ఆంధ్రుల కరపద్మములకు దానిని గూడ అర్పించగలవాడను.
    "తిరుక్కుఱళు" శబ్దము యొక్క వ్యుత్పత్తిని గూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. తిరుశబ్దము శ్రీ శబ్దభవము - శృఈ శబ్దము ఆంధ్రభాషలో 'సిరి ' యగునట్లే తమిళ భాషలో 'తిరు ' అగును. తిరుమణి, తిరువీధి, తిరుపతి, తిరువల్లిక్కేణి, తిరువణ్ణామలై, తిరువల్లువరు మొదలగు పేరులలో నింకను యలరారుచున్నది. శ్రె యనగా శుభ్రమైన లేక దైవసంభంధమయిన యని యర్ధము.  కుఱుళనగా యించుమించు సూత్రమని యర్ధము - విస్తారమగు అర్ధమును భావమును నొక చిన్న వాక్యము లేక పద్యములో నిముడ్చబడినచో దానికి కుఱళు అని అర్ధము- కుఱళుశబ్దమునకు వ్యుత్పత్తి యర్ధము పొట్టిదైన" యని., అయినను తిరువల్లువరునాయవారు ఈ గ్రంధమును రచించిన నాటనుండియు ఆ శబ్దము ఈ గ్రంధమునకు మాత్రమే చెందుచు వచ్చినది. గీతయనగనే భగద్గీత యగునట్లు బైబిలు (అసలు అర్ధము పుస్తకము అని) అనగనె క్రైస్తవమత గ్రంధమగు బైబిలు అగునట్లు, వేదము(అనగా చెప్పబడినదియని మొదటి యర్ధము, మాట) అనగనె మన ఆర్యవేదములగునట్లు కుఱళు అనగనె వల్లువరిగారి కుఱళేయగుచున్నది.
   ఇది యెల్లయును పద్యములలో వ్రాయబడిన కావ్యమైయున్నది. ప్రతి పద్యమును రెండేసి చరణములు గలది - అందుకో మొదటి చరణము రెండవ దానికన్న పొడుగైనది. తమిళ సాంప్రదాయ ప్రకారము యతితోనో