పుట:Garimellavyasalu019809mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవలకారుని కంటె యిట్టివాడు పుట్టుట సులభము. నవలలో మానవ జీవితము నొక అద్య్లాయము నెల్ల చిత్రించవలసి యున్నది. ఇందులో నాలుగైదు తావులు కాని, ఒకటి రెండు తవులు కాని ఒక్క తానైనను చిత్రించి పొడుగు కాకుండా చూచుకుంటే చాలును. భారతి యిట్టి వానిని కందామని నొప్పులు పడుచున్నది. ఎవరు పుడతారో చెప్పజాలము.

రాగల గద్య్లకావ్యములు

  పురాణములలోని నాయకుల జీవితములను ఈ నూతన దృష్టితో తిలకించుచు, వారి జీవితములు మన కెట్టి సందేశముల నిచ్చుచున్నవో యుద్భోదించుచు వారి చర్యలకు క్రొత్త క్రొత్త అర్ధములను వ్యాఖ్యానములను సేయుచు, గద్య గ్రంధములను వ్రాయుచో అవి చక్కని కావ్యములగును. లేదా చరిత్రక మహాపురుషుల, పరాక్రమశాలుర జీవితములను, వారిని వారి వారి పరిస్థితులళో నిలిపి వారి శత్రువులను కష్టములను వారు అతిక్రమించి యెట్లు ధన్యులైనారో అనుకూలమగు అధ్యాయములుగ కధ విభజించి వ్రాయుచో అదియును చక్కని గద్య కావ్యము కాకమానదు. అనేకము అంశములమీద సుందరమగు భాషలొ ప్రతి వారును తమ సుందరములగు అభిప్రాయములను వ్యాసరూపుములుగా వ్రాయవచ్చును. అవి సూరిశాస్త్రిగరి నాట్యలెఖల వలె గాని పానుగంటి లక్ష్మీనరసీహారావుగారి సాక్షి ఉపన్యాసముల వలె గాని అంత పెద్దవై యుండవచ్చును. లేదా యింకను చిన్నవి చేయవచ్చును. ఇట్టి వ్యాసములలో కేవలము ధోరణియు విపులత్వము కొరకు గాక క్లుప్తత, రూఢి, సుందరత్వముల కొరకు ప్రయత్నించుచుండుట మంచిది.  వీటి యన్నిటిలోను కేవలము ధోరణికే కాక సౌందర్యూమునకు గూడా శైలి యందు తావుగలదు.

ఆంధ్రనాటకములు

   ఆంధ్రనాటకములను గూర్చి మన దేశములలో నీ మధ్యను లెచినంత విమర్శనము అభిప్రాయములు, పత్రికలు, వ్యాసములు గ్రంధములును మరియే యితర శాఖపైగాని లేవలేదు. ప్రజ్ఞావంతులు కొందరందులో పాల్గొనుచున్నారు. పాటలు కావలెననువారు, వద్దను వారు, పద్యమును రాగము విసరిచదువు