నవలకారుని కంటె యిట్టివాడు పుట్టుట సులభము. నవలలో మానవ జీవితము నొక అద్ధ్యాయము నెల్ల చిత్రించవలసి యున్నది. ఇందులో నాలుగైదు తావులు కాని, ఒకటి రెండు తావులు కాని ఒక్క తావైనను చిత్రించి పొడుగు కాకుండా చూచుకుంటే చాలును. భారతి యిట్టి వానిని కందామని నొప్పులు పడుచున్నది. ఎవరు పుడతారో చెప్పజాలము.
రాఁగల గద్యకావ్యములు
పురాణములలోని నాయకుల జీవితములను ఈ నూతన దృష్టితో తిలకించుచు, వారి జీవితములు మన కెట్టి సందేశముల నిచ్చుచున్నవో యుద్బోధించుచు వారి చర్యలకు క్రొత్త క్రొత్త అర్థములను వ్యాఖ్యానములను సేయుచు, గద్య గ్రంధములను వ్రాయుచో అవి చక్కని కావ్యములగును. లేదా చారిత్రక మహాపురుషుల, పరాక్రమశాలుర జీవితములను, వారిని వారి వారి పరిస్థితులలో నిలిపి వారి శత్రువులను కష్టములను వారు అతిక్రమించి యెట్లు ధన్యులైనారో అనుకూలమగు అధ్యాయములుగ కథ విభజించి వ్రాయుచో అదియును చక్కని గద్య కావ్యము కాకమానదు. అనేకము అంశములమీద సుందరమగు భాషలో ప్రతి వారును తమ సుందరములగు అభిప్రాయములను వ్యాసరూపుములుగా వ్రాయవచ్చును. అవి సూరిశాస్త్రిగారి నాట్యలేఖల వలె గాని పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి సాక్షి ఉపన్యాసముల వలె గాని అంత పెద్దవై యుండవచ్చును. లేదా యింకను చిన్నవి చేయవచ్చును. ఇట్టి వ్యాసములలో కేవలము ధోరణియు విపులత్వము కొరకు గాక క్లుప్తత, రూఢి, సుందరత్వముల కొరకు ప్రయత్నించుచుండుట మంచిది. వీటి యన్నిటిలోను కేవలము ధోరణికే కాక సౌందర్యూమునకు గూడా శైలి యందు తావుగలదు.
ఆంధ్రనాటకములు
ఆంధ్రనాటకములను గూర్చి మన దేశములలో నీ మధ్యను లేచినంత విమర్శనము అభిప్రాయములు, పత్రికలు, వ్యాసములు గ్రంథములును మరియే యితర శాఖపైగాని లేవలేదు. ప్రజ్ఞావంతులు కొందరందులో పాల్గొనుచున్నారు. పాటలు కావలెననువారు, వద్దను వారు, పద్యమును రాగము విసరిచదువు
గరిమెళ్ళ వ్యాసాలు
23