పుట:Garimellavyasalu019809mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దృశ్యమగు చిత్రములనప్పుడప్పుడు వ్రాసుకొని దఫదఫాలుగా పత్రికలకు పంపుతున్నారు. కొదరు పత్ర్కలకు పంపవలెననియే యేవైన అంశమును కల్పింఉకొని వ్రాయుచున్నరు పత్రికలును పెక్కులు వెలయుచున్నది. కనుక పద్యముల యొక్క గుణాగుణముల ప్రశంశనకుపోక చరణములైనంత మాత్రముననే వానిని తమ పత్రికలలో నిర్ణయించబడిన (Column) కాలములో నదికి ప్రచురించుచున్నవి. కవి పేరులు కూడ ప్రచురించుచుండుటచేత నామ ప్రచురణాభీలాష గల అనెకులు యుకులు కూడ ప్రతివారమూ పత్రికలకు పద్యములను పంపుచున్నారు. ప్రతి పత్రికాలయమునందును వారు కూడ ప్రచురింపజాలనన్ని ఖండకావ్యములు పెరుగుచు ప్రచురనమయేవి కాగా మిగిలినవి నెలకొకసారి పరశురామప్రీతి యగుచున్నవి. ఇట్లు మనదేశములో ఖండకావ్యముల యుగము ప్రారంభమైనది. ఇది యంతయు దేశానర్ధక మనియు భాషానాశకరమనియు, అపాండిత్య జన్య మనియు, అల్పజ్ఞతా సూచక మనియు భావించి సంస్కృత పాండిత్యము కావ్య ప్రబంధ పరిశ్రమమును, నుభయ బాషా ప్రభుత్వమును, విజృంభనమును, భాషాశుద్ధియును గల వారు తొంటి పద్దతిపైని బ్రమను విడిచిపెట్టుకొనలేక, అట్టి దైన సమబంధములును భక్తి సంబంధములును నగు కృతులు సేయుటయే వంశపావనమనియు, భవితారకమనియు భావించి - ప్రబంధముల జాబితా కింకొక గ్రంధమును ఆ మతలపు పద్యములకు మరి కొంత సంఖ్యయును చేర్చుచున్నారు.

         ఇట్లు మన నేటి ఆంధ్ర కవిత్వమును ప్రబంధ కవిత యొక వైపు నుంచి జూచుచు, యీ చెల్లా చెద్రేమిటి! యీ అగాధమేమిటి! యీ అజ్ఞానమెమిటి! అని విచారించుచు హేళన సేయుచున్నది. ఒక వైపు నుంచి పత్రికలు, సంచికలు, నామ ప్రచురణ వాంఛలు, నవీనతాభిలాషలు, క్రొత్త క్రొత్త దృశ్యములు, యెఱలు, భ్రమలు, ఆశలు, నిరాశలు మొదలగు నవి పెరిగి తమ వైపునకు లాగుకొనుచున్నవి. అయితే ప్రబంధ హెళనల నిది లెక్కసేయక, స్తాతంత్ర్యమును స్వవికాసమునే తన సంకల్పమైనట్లును బంధనములు ముళ్లు మొదలగు వారిలో నదియె నొవ్వ  చెడుచున్నదనియు యెదురు హేళనలు సలుపుచున్నది. లాబమే కానిండు నష్టమే కానిండు తొంటి