పుట:Garimellavyasalu019809mbp.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కావ్యములనవచ్చును. కాని అవి నిజముగా అలంకార శాస్త్రక్రమము దేనికైన బద్దములైన కావ్యముల్ కావని మన మనవలెను. "రసాత్మకం కావ్య" మని అందులో రసము తళుకులున్నంత మాత్ర్రముననే అవి కావ్యములగుచున్నవని భావించి మనము ఖండకవ్యములను గత్యంతరము లేని నామకరణము చేసుకొన్నాము కాని రఘువంశము వలె గాని మనుచరిత్రము వలె గాని అవి కావ్యములు కావి యేరుగునది.

భావకవిత్వ ప్రారంభము

   ఆంగ్లభాష నభ్యసించు విద్యార్ధులు క్లాసులో పఠించి పాఠమును గ్రహించి ప్రశంసింప నేర్చుకొన్న వివియే కనుక యట్టి పద్యములు మన భాషలో లెకుండుటచే వానిని జొప్పింతమను కుతూహలము చెలరేగెను. కాక వీరికి సంస్కృత భాషా కావ్యముల పరిచయము కాని తెలుగు కావ్యముల నైనను ఆంగ్ల కావ్యము లంత శ్రద్ధగా పఠించెడి తీరుబాటు కాని తక్కువయయ్యను. కాక అట్టి ప్రబంధములున్ కావ్యములును యెక్కువగా నుండుటచేతను, చాదస్తపు పండిత్లెల్లరును నింకా అదే మతలపుల మీద పదములు మార్చి, చెప్పిన భావములు చెపుచు పదవిడంబనమే కని కవితా మాధుర్యమును చూపజాలకుండుట చేతను, అట్టి కావ్యముల కంటె ఇట్టి "కావములు" రచించుటయే వీరికి సులభముగా నుండుటయే కాక దేశహితమనియు, భాష కొక క్రొత్త పోకడయనియు, ఆంధ్రవణి కొక నవ్యాలంకార మనియు తొచినది.  వార్తాపత్రికలును, మాససంచికలను వెలయుచుండేడి యుగమ్లో వాటికి దూరమై కాఱడవులలో గూర్చున్న వారికి తప్ప పూర్వకాలపు దీర్ఘ కావ్యముల వంటి కావ్యములు వ్రాయుటకు వీలు లేదు. ఇదియును కాక కావ్యరచన ముక్తిప్రదమను భావం పోయినది. సప్తసంతానములలో నొకటని యెంచి కృతి నంది కవితలకములను పోషించు రారాజులును అస్తమించిరి. ఇప్పటి కవిత్వము యొక్క్ ఆశయ మెల్లను వాలుకుర్చీలో కూర్చున్ వార్తాపత్రికా పుటముల నించుక తీరుబడి చూచుకొని తిరుగవేయచుండు పాఠకుని తృప్తిపరచుటయు, తోందర తొందరగను తప్పకుండను మాససంచికలకు "Matter" నిచ్చుటయును నైయున్నది  ఇప్పటి "భావకవీశ్వరు" లలో కొందరు, తమకు మంచి సమయములలో